విలీనం, విమోచనం అంటూ తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో చెలగాటం ఆడుతున్నారని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.తెలంగాణ ఉద్యమం అంటే ఎంటో తెలియని వారు కూడా మాట్లాడటం దౌర్భాగ్యమని మండిపడ్డారు.
సెప్టెంబర్ 17 సందర్భంగా పరేడ్‌గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం సభ నిర్వహించడం సరికాదన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని ఆరోపించారు.
రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ.ఇబ్బందులకు గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాతీయ సమైక్యత, సమగ్రతకు విఘాతం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తుందనే అనుమానం వస్తుందని ఆయన వ్యాఖ్యనించారు.అనంతరం రాష్ట్ర గవర్నర్ తమిళిసైపై గుత్తా విమర్శలు గుప్పించారు.
ఆమె కూడా విమోచన దినోత్సవం అని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.గవర్నర్ తన పూర్వ పార్టీ భావజాలాన్నే అనుసరిస్తున్నారని విమర్శించారు.
గవర్నర్ వ్యవస్థకు ఉండే గౌరవాన్ని పోగొట్టొద్దని సూచించారు.







