తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ బిల్లుపై సీఎం కేసీఆర్ ప్రసంగించారు.ఏపీ నుంచి తెలంగాణకే రూ.17,280 కోట్లు రావాల్సి ఉందన్నారు.కానీ ఏపీకి విద్యుత్ బకాయిలు నెలలో కట్టకపోతే చర్యలు తీసుకుంటామని, మరో రూ.3 వేల కోట్లు వడ్డీ అంటోందని కేసీఆర్ తెలిపారు.ఈ క్రమంలో తెలంగాణకు రావాల్సిన నగదులో రూ.6 వేల కోట్లు మినహాయించి మిగతా మొత్తాన్ని కేంద్రమే ఇప్పించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఏపీలోని కృష్ణపట్నం సహా అనేక రంగాల్లో తెలంగాణ వాటా ఉందని పేర్కొన్నారు.
తను చెప్పిన విద్యుత్ లెక్కలు అసత్యమని నిరూపిస్తే తక్షణమే రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాల్ చేశారు.







