మీరు మద్యం ప్రియులా? అయితే తాగిన తర్వాత వీటిని తినకండి.. గుండెపోటు వస్తుంది!

నేటి యువతకి మందు తాగడం అనేది ఫ్యాషన్ అయిపోయింది.ఇక వీకెండ్ పేరుచెప్పి, శనివారం.

 Are You An Alcoholic But Don T Eat These After Drinking Heart Attack ,liquid ,-TeluguStop.com

ఆదివారాలు కేవలం తాగడానికే కేటాయిస్తున్న మహానుభావులు మనచుట్టూ ఎంతోమంది వున్నారు.అలాగే సంతోషం కలిగినా, బాధ కలిగినా కూడా కొందరికి ముందుగా గుర్తొచ్చేది మద్యమే.

అయితే కొందరు ఆల్కహాల్ ను తాగడానికి కారణాలు వెతుక్కుంటే.మరికొందరు మాత్రం సమయం సందర్భం అంటూ ఏదీ లేకుండా.

రోజూ లాగిస్తూనే ఉంటారు.ఆల్కహాల్ ను తాగితే మాత్రం మీ ఆయుష్షు దగ్గర పడుతున్నట్టే లెక్క.

దీనికి తోడు లివర్ దెబ్బతింటుంది.గుండె రిస్క్ లో పడుతుంది.

శరీరం సక్రమంగా పనిచేయదు.

మొత్తంగా చెప్పాలంటే ఈ మందు మిమ్మల్ని మంచానికే పరిమితం చేస్తుందని అర్ధం చేసుకోవాలి.

అందుకే ఆల్కహాల్ తరచుగా తాగడం మానేయడమే ఉత్తమం.ఇక ఎప్పుడన్నా ఒకసారి తాగితే అప్పుడు కూడా లిమిట్ లోనే తాగాలి.

ఇక అసలు విషయంలోకి వెళితే, ఆల్కహాల్ తాగిన తర్వాత ఏది పడితే అది తినకూడదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.అయితే ఇపుడు మద్యం తాగినప్పుడు ఎలాంటి ఆహారాలను తినకూడదో తెలుసుకుందాం.

ఆల్కహాల్ తాగేటప్పుడు చాలా మంది ఆయిలీ ఫుడ్స్ నే ఎక్కువగా తింటుంటారు.ఆ సమయంలో అవి టేస్టీగా అనిపించినా మీ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు.

Telugu Alcoholic, Tips, Healthy, Heart Attack, Heath Care, Liquid, Milk Sweets,

ఒకవేళ ఆల్కహాల్ తాగి ఆయిలీ ఫుడ్స్ ను తింటే జీర్ణక్రియ మందగిస్తుంది.ముఖ్యంగా ఈ ఫుడ్స్ గుండెను రిస్క్ లో పడేస్తాయి.ఫుల్ గా ఆల్కహాల్ తాగిన తర్వాత పాలు, తీపి పదార్థాలను తాగకపోవడమే మంచిది.వీటివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.అందులో ఆల్కహాల్ ను తాగి పాలు తాగితే హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం మెండుగా ఉంది.మందు తాగిన తర్వాత ముఖ్యంగా పాలు, స్వీట్ ఐటమ్స్ ను ఎట్టి పరిస్థితిలో తీసుకోకండి.

సాధారణంగా కొంతమంది మద్యంలో నీళ్లను కలుపుకుని తాగుతుంటారు.ఇంకొంతమంది మాత్రం శీతల పానీయాలనో లేదా సోడానో మిక్స్ చేసుకుని తాగుతుంటారు.

నిజానికి సోడాలను, శీతల పానీయాలను ఆల్కహాల్ ను కలుపుకుని తాగకూడదు అని గుర్తించుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube