డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ రాష్ట్రం కోలుకుంటుందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.రాష్ట్ర సాధన లక్ష్యం వేరు.
ఇప్పుడు జరుగుతున్నది వేరని ఆరోపించారు.ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేస్తున్నారో ప్రజలు గమనించాలన్నారు.
మునుగోడులో బీజేపీ లేదన్నది ఒకప్పటి మాటన్న రాజగోపాల్ రెడ్డి.రానున్న ఉపఎన్నికల్లో కాషాయమే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలు చారిత్రక తీర్పు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు.







