సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి నటి రకుల్ ప్రీతిసింగ్ తాజాగా హాస్పిటల్ పాలయ్యారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇలా ఈమె ఆస్పత్రి పాలవడంతో అభిమానుల సైతం అసలు రకుల్ ప్రీతిసింగ్ కు ఏం జరిగింది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే రకుల్ ప్రీతిసింగ్ ఇలా హాస్పిటల్ పాలవడానికి గల కారణం ఆమె భారీగా వర్కౌట్ చేయడమే కారణమని తెలుస్తుంది.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఈ పోటీలో ముందుకు కొనసాగడం కోసం ఈమె తన శరీర ఫిట్నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇలా ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే రకుల్ ఏ మాత్రం ఖాళీ సమయం దొరికిన వెంటనే జిమ్ లో వాలిపోతూ హెవీ వర్కౌట్ చేస్తూ తన ఫిట్నెస్ కాపాడుకుంటూ ఉంటారు.ఇలా ఫిట్నెస్ విషయంలో ఏమాత్రం రాజీ కానటువంటి రకుల్ ప్రీతిసింగ్ ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ వర్కౌట్ చేయడం వల్లే ఈమె హాస్పిటల్ పాలయ్యారని తెలుస్తుంది.

ఈ విధంగా జిమ్ లోహెవీ వర్కౌట్ చేస్తూ ఉన్నటువంటి ఈమె ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారని దాంతో ఈమెను హాస్పిటల్ కి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.అయితే రకుల్ కి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ ఈ విషయంపై రకుల్ ఫ్యామిలీ కానీ లేదా తన టీం కానీ ఎక్కడ అధికారకంగా వెల్లడించలేదు.మరి ఈమె ఆరోగ్యం పట్ల వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ అభిమానులు మాత్రం ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంపై క్లారిటీ రావాలంటే రకుల్ స్పందించాల్సి ఉంది.







