బాలీవుడ్ భారీ చిత్రం బ్రహ్మాస్త్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు గాను చిత్ర సభ్యులు ఏర్పాట్లు చేశారు.
దాదాపు రెండు నెలలుగా సినిమా కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించిన సభ్యులు ఇంకా కూడా అదే పనిలో నిమగ్నమై ఉన్నారు.సినిమా విడుదల చివరి నిమిషం వరకు ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
తాజాగా హీరో రణబీర్ కపూర్ మరియు హీరోయిన్ ఆలియా భట్ ఇతర చిత్ర యూనిట్ సభ్యులు కలిసి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఒక దేవాలయానికి వెళ్లారు.ఆ సందర్భంలో కొందరు వారిని అడ్డుకున్నారు.
బాయికాట్ బ్రహ్మాస్త్ర నినాదాలు చేస్తూ వారు అలియా భట్ మరియు రణబీర్ కపూర్ లను అసలు కారు దిగకుండా వెనక్కు వెళ్లిపోయేలా చేశారు.
ఇన్నాళ్లు సోషల్ మీడియా లో మాత్రమే బాయికాట్ బ్యాచ్ సందడి చేస్తున్నారని అంతా అనుకున్నారు.
కానీ ఇప్పుడు వారు ఇలా రోడ్డు మీదకి ఎక్కి మరీ నిరసనలు తెలియ జేయడంతో ముందు ముందు ఈ సినిమాకు అత్యంత గడ్డు కాలం కనిపిస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ సభ్యులు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
వారందరికీ కూడా ఇదే పరిస్థితి ఎదురైనట్లుగా తెలుస్తోంది.బ్రహ్మాస్త్ర సినిమా ని విడుదల అవ్వనిచ్చేది లేదు.
విడుదలైనా కూడా థియేటర్లో వద్దకు ప్రేక్షకులు వెళ్లకుండా ప్రచారం చేస్తామంటూ వారు ఇప్పటికే చిత్ర సభ్యులను హెచ్చరించారు.బాయికాట్ కి అనేక కారణాలు ఉన్నాయి.
రణబీర్ కపూర్ ఈ సినిమాను సుశాంత్ సింగ్ రాజ్పూత్ నుండి లాక్కున్నాడు అనేది మొదటి ఆరోపన.ఆ తర్వాత చాలా చాలా ఆరోపణలు రావడంతో ఈ సినిమా బాయికాట్ చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.







