వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సీఐగా కూన దుర్గాప్రసాద్

విశాఖపట్నం నగరంలోని వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సీఐగా కూన దుర్గాప్రసాద్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ నేపథ్యంలో కంచరపాలెంలోని తన కార్యాలయంలో సీఐ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తామన్నారు.

 Koona Durgaprasad As West Sub Division Crime Ci-TeluguStop.com

ముఖ్యమైన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెడతామని చెప్పారు.నేరాల నియంత్రణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు.

యువత చెడు వ్యసనాలకు బానిసలు అయి వారి బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.తమ డివిజన్ పరిధిలో రాత్రి వేళ గస్తీ మరింత ముమ్మరం చేస్తామన్నారు.

ప్రజలను మరింత అప్రమత్తం చేస్తామని చెప్పారు.నగర పోలీస్ కమీషనర్ సీహెచ్.

శ్రీకాంత్ ఆదేశాల మేరకు తన శక్తి వంచన లేకుండా నేరాల నియంత్రణకు కృషి చేస్తానని సీఐ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు.ఈ సందర్బంగా పలువురు ఎస్ఐలు దుర్గాప్రసాద్ కు పుష్ప గుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube