సొంత ఖర్చులతో లేబర్ కార్డ్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో భవన నిర్మాణ కార్మికులకు తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ వారి తండ్రి గాదరి మారయ్య జ్ఞాపకార్థముగా నియోజకవర్గంలోని 100 మంది కార్మికులకు తన స్వంత ఖర్చులతో లేబర్ ఇన్సూరెన్సు కార్డులు పంపిణీ చేశారు.

 The Mla Distributed Labor Cards At His Own Expense-TeluguStop.com

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కార్మిక సంక్షేమం కోసం పాటు పడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు, నియోజక వర్గంలోని భవననిర్మాణ రంగంను నమ్ముకున్న జీవిస్తున్న కార్మికులందరు లేబర్ ఇన్సూరెన్సు కార్డ్స్ కలిగిఉండాలి అన్నారు.లేబర్ ఇన్సూరెన్సు కార్డ్స్ ఉంటే తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ నుండి వచ్చే కార్మిక సంక్షేమ పథకాలు,భీమా పథకాలను వినియోగించుకోవాలని అన్నారు.

భవన నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్సు ఉంటే ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే 6లక్షల 30వేల రూపాయలు వారి కుటుంబసభ్యులకు అందజేయటం జరుగుతుంది,సహజ మరణం సంభవిస్తే 1లక్ష 15వేల రూపాయలు,శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే 4లక్షల 15వేల రూపాయలు,తాత్కాలిక అంగవైకల్యం సంభవిస్తే 2లక్షల 15వేల,రూపాయలు అందించబడతాయని,అదేవిధంగా కుటుంబంలో ఆడ పిల్లలు ఉంటే వారి వివాహ కానుక గా 30వేల రూపాయలు,కూతురు గాని,భార్య గాని గర్భిణీ ఐతే వారి ప్రసవానికి అయ్యే ఖర్చు నిమిత్తం 30వేల రూపాయలు అందించబడతాయని,కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు లేబర్ ఇన్సూరెన్సు కార్డ్స్ విధిగా భావించి తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ డైరెక్టట్ గుడిపాటి సైదులు,తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం తుంగతుర్తి నియోజక వర్గ భాద్యులు గౌడిచెర్ల సత్యనారాయణ గౌడ్,వైస్ ఎంపీపీ శ్రీశైలం,తుంగతుర్తి మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వరులు,ఎంపీటీసీ చెరుకు సుజనా పరమేష్,బీరపొలు నారాయణ,బోనుకూరి శ్రీను, జాజుగాళ్ళ అంబేద్కర్,బొంకూరి సురేష్,గుగులోత్ బద్రు,ఎర్ర రమేష్,ఈరు నాయక్,కోడిదల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube