దొంగలంటే అదేదో పాత సినిమాల్లో చూపించినట్టు పెద్ద పెద్ద కోరమీసాలు, గళ్ళలుంగీ, నోటిలో చుట్ట, చంకలో బాకు పెట్టుకొని వుంటారు అని అనుకోవద్దు.దొంగలు ఎప్పటికప్పుడు తమ అవతారాలను మారుస్తూ వుంటారు.
కొంతమంది దొంగలు బయటకు చూడటానికి ఓ ఎంప్లొయ్ లాగా, చాలా హుందాగా కనిపిస్తారు.కానీ వారు చేసే పనులు చూస్తే… వారి గెటప్ కి, చేష్టలకి అస్సలు మ్యాచ్ అవ్వదు.
తాజాగా జరిగిన అలాంటి ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నెటిజన్లు దానిపై తీవ్రంగా స్పందిస్తున్నారు.‘వెధవని పట్టుకోవాలి’ అంటూ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు.వారికే కాదు, సదరు వీడియో చూస్తే.
మీకు అంతకంటే ఎక్కువ కోపం వస్తుంది.వివరాల్లోకి వెళితే… యూపీలోని మధుర రైల్వే స్టేషన్ లో తల్లి చెంతన నిద్రిస్తున్న ఓ చిన్నారిని బయటకు హుందాగా కనిపిస్తున్న ఓ వ్యక్తి దొంగ చాటున వచ్చి ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
దాంతో ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం వెతుకుతున్నారు.
CC కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను విడుదల చేశారు.
నిందితుడు ఫొటోను కూడా విడుదల చేశారు.అతడి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే తమకు అందించాలని కోరుతున్నారు.
వీడియో వివరాల్లోకి వెళితే… మధుర రైల్వే స్టేషన్ లోని ప్లాట్ ఫామ్ పై 7 నెలల చిన్నారి తన తల్లి చెంతన హాయిగా గాఢ నిద్రలోకి జారుకుంది.ఆ సమయంలో ఆ వ్యక్తి అటు ఇటు తిరిగి, చాటుగా ఆ చిన్నారిని ఎత్తుకెళ్లాడు.
అదే సమయంలో అక్కడ తన తల్లి కూడా గాఢ నిద్రలో ఉండటం మనం గమనించవచ్చు.ఇందుకు సంబంధించి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు బృందాలను ఏర్పాటు చేశారు.నిందితుడి ఫొటోని తాజాగా విడుదల చేసి అతనికి సంబంధించిన వివరాలు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.







