ఒక్కో వెరైటీకి ఒక్కో ఎక్స్‌ప్రెషన్.. భారతీయ వంటకాల రుచికి ఫిదా అయిన ఆస్ట్రేలియన్ మహిళ

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు మన సంస్కృతిని, ఆచార వ్యవహారాలను అక్కడ కూడా విస్తరిస్తున్నారు.అంతేకాకుండా మనకు మాత్రమే సొంతమైన వంటకాలను విదేశీయులకు కూడా రుచిచూపిస్తున్నారు.

 Australian Woman Tries Indian Snacks For The First Time , Australian Woman, Indi-TeluguStop.com

అనకాపల్లి నుంచి అమెరికా వరకు ఇప్పుడు అన్ని దేశాలలో భారతీయ రెస్టారెంట్లు పరదేశీయులను కూడా ఆకట్టుకుంటున్నాయి.మన వంటకాల రుచికి వారు కూడా వహ్వా అనాల్సిందే.

అందుకే ఏ దేశంలో చూసినా మన హోటళ్లు, రెస్టారెంట్లు నిత్యం కిటకిటలాడుతూ వుంటాయి.ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మన భారతీయుల కంటే అక్కడి స్థానికులే ఎక్కువగా ఆ హోటళ్లకు ఎగబడుతున్నారు.

ఒక్కసారి టేస్ట్ చేస్తే చాలు దానికి ఎవరైనా ఫ్యాన్స్‌గా మారాల్సిందే.తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన మహిళ విషయంలో ఇదే జరిగింది.

వివరాల్లోకి వెళితే.టానర్ ఆనే ఆసీస్ మహిళ జీవితంలో తొలిసారిగా భారతీయ వంటకాలను రుచిచూశారు.

అంతేకాదు.ఈ తతంగాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తొలుత గుజరాతీయుల ఫేవరేట్ భాకరవాడితో మొదలుపెట్టిన టానర్.ఆ తర్వాత కుర్‌కురే, చిప్స్, మాత్రి వంటి స్నాక్స్‌ను టేస్ట్ చేశారు.

అయితే వీటన్నింటిలోకి సోన్ పాపిడీ ఆమెకు బాగా నచ్చేసింది.ప్రస్తుతం టానర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ముఖ్యంగా ఆమె ఒక్కో వంటకానికి ఒక్కో ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడంతో నెటిజన్లు కూడా ముచ్చటపడుతున్నారు.

Telugu America, Arieh Smith, Australia, Australian, Indian, Inidan, Soan Papdi,

ఇకపోతే.కొద్దిరోజుల క్రితం అమెరికాకు చెందిన యూట్యూబర్ కూడా భారతీయ వంటకాల రుచికి ఫిదా అయ్యారు.అరీహ్ స్మిత్‌ అనే వ్యక్తికి క్జియోమానిక్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ వుంది.

అయితే అతనికి దక్షిణ భారతదేశానికి చెందిన త‌మిళ భాష అంటే ఎంతో ఇష్టం.ప్ర‌పంచంలోనే త‌మిళం పురాతన భాష అని తెలుసుకున్న స్మిత్.

పట్టుబట్టి తమిళ భాషను మాట్లాడడం నేర్చుకున్నాడు.అంతేకాదు.

న్యూయార్క్ న‌గ‌రంలోని త‌మిళ‌ షాపులు, హోటళ్లను వెతుక్కుంటూ వ‌చ్చి, అక్క‌డ త‌మిళంలోనే ఫుడ్ ఆర్డ‌ర్ ఇస్తుంటాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube