బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 5 గురించి అందరికి తెలిసిందే.ఈ సీజన్ లో కూడా మొత్తం 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొని బాగా సందడి చేశారు.
అందరు కంటెస్టెంట్ లు తమ పరిచయాన్ని పెంచుకొని ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.అలా ట్రాన్స్ జెండర్ గా ప్రియాంక సింగ్ కూడా అందరికి బాగా దగ్గరైంది.
బిగ్ బాస్ తోని మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
ఇక ప్రియాంక అడుగు పెట్టి తొలి చూపులతోనే, తొలి మాటలతోనే బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తొలిసారిగా ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో లేడీ గెటప్ తో పరిచయమైంది ప్రియాంక.ఇక ప్రియాంక అసలు పేరు సాయి తేజ.ఇక ఈమె లేడీ గెటప్ అని అందరూ అనుకున్నారు.కానీ తాను సర్జరీ చేయించుకుని ట్రాన్స్ జెండర్ గా మారాను అని గతంలో తెలిపింది.
ఈ విషయం గురించి తన తండ్రికి తెలియదంటూ బిగ్ బాస్ వేదికపై తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది.బిగ్ బాస్ తర్వాత ప్రియాంక తన తల్లిదండ్రులను కలిసి వారితోనే ఉండిపోయింది.
ఇక సీజన్ ఫైవ్ లో అడుగుపెట్టిన ప్రియాంకను చూసి ప్రేక్షకులందరూ భయపడ్డారు.కారణం సీజన్ త్రీ లో పాల్గొన్న మరో ట్రాన్స్ జండర్ తమన్నా సింహాద్రి లా ప్రవర్తిస్తుందేమో అని అనుకున్నారు.
కానీ తమన్నా సింహాద్రి కి పూర్తి వ్యతిరేకంగా ఉంది ప్రియాంక.సున్నితంగా మాట్లాడుతూ.అందరితో మంచిగా కలుసుకుంటూ తన వ్యక్తిగత విషయాలను బాగా పంచుకుంది.అందులో కొందరు కంటెస్టెంట్ లను కూడా అక్క, అన్న అంటూ వరుసలు కలుపుకొని బాగా దగ్గరైంది.
దీంతో ప్రేక్షకులు ప్రియాంకను తెగ పొగిడారు.

అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ అందుకున్న ప్రియాంకకు.ఆమెనే గెలిపిస్తాం అంటూ సోషల్ మీడియాలో బాగా రచ్చ రచ్చ చేశారు.కానీ అంత వరకు చేరుకోలేకపోయింది.
అంతేకాకుండా హౌస్ లో ఉన్నంతకాలం మరో కంటెస్టెంట్ మానస్ కి తన మనస్సు కూడా ఇచ్చేసింది.కానీ తను ఆమెను చివరి వరకు దూరం పెడుతూనే వచ్చాడు.
ఆ తర్వాత ప్రియాంక సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు మరింత దగ్గరయింది.అందులో తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.నిత్యం ఏదో ఒక ఫోటో పరుచుకుని ప్రియాంక తాజాగా తన హల్దీ ఫొటోస్ పంచుకొని అందరికీ షాక్ ఇచ్చింది.
దీంతో ఆ ఫోటోలో తను పెళ్లికూతురుల తయారయ్యి ఉండగా ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు ప్రియాంక త్వరలో పెళ్లి చేసుకోబోతుందా అంటూ అందుకేనా ఈ హల్దీ ఫొటోస్ అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ప్రియాంక వీటిని ఫోటోషూట్ లాగా తీయించుకుందో లేక త్వరలో పెళ్లి చేసుకోనుందో తెలియదు కానీ ప్రస్తుతం ఆ ఫోటోలు మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి.
ఇక ఆ ఫోటోలో తను చాలా అందంగా ఉంది.







