ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇండో అమెరికన్ జర్నలిస్ట్ బహిష్కరణ, కుటుంబ సభ్యుల ఆగ్రహం

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత సంతతికి చెందిన అమెరికా జర్నలిస్ట్ బహిష్కరణకు గురైనట్లుగా తెలుస్తోంది.అమెరికన్ న్యూస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ ‘‘Vice’’తో సంబంధాలున్నాయనే అభియోగాలపై ఢిల్లీ విమానాశ్రయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

 Indo American Journalist Deported From Delhi Airport , Indira Gandhi Internation-TeluguStop.com

బాధితుడిని అంగద్ సింగ్‌గా గుర్తించారు.దీనికి సంబంధించి అతని కుటుంబ సభ్యులు పంజాబ్‌లో మీడియాకు వివరాలు తెలియజేశారు.

అంగద్ సింగ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.అతను బుధవారం రాత్రి 8.30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగాడు.అయితే కేవలం మూడు గంటల్లోపే అతనిని అమెరికాకు బహిష్కరించారు అధికారులు.

సింగ్ తన కుటుంబ సభ్యులు, ఆత్మీయులను కలిసేందుకు భారత్‌కు వచ్చాడని వారు పేర్కొన్నారు.దీనిపై జాతీయ మీడియా ఇమ్మిగ్రేషన్ అధికారులను సంప్రదించగా.

వారు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.

ఇకపోతే.

విధి నిర్వహణలో భాగంగా అంగద్ సింగ్ దక్షిణాసియాను కవర్ చేస్తారు.ఈ క్రమంలో షాహీన్ బాగ్‌లో ఇటీవల జరిగిన నిరసన కార్యక్రమాలపై అతను ఓ డాక్యుమెంటరీ తీశాడు.

దీనిపై భారత ప్రభుత్వం ఉలిక్కిపడింది.ఈ క్రమంలోనే భారత్‌లోని దళితులపై డాక్యుమెంటరీ తీయడానికి ఒక జర్నలిస్ట్‌గా అంగద్ సింగ్ చేసిన దరఖాస్తును కేంద్రం ఇటీవల తిరస్కరించింది.

అయితే కుటుంబ సభ్యులను కలిసేందుకు, వ్యక్తిగతంగా భారత్‌కు పయనమయ్యాడు.కానీ ఢిల్లీలో ల్యాండైన్ వెంటనే అతనిని వెనక్కి తిప్పిపంపారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Angad Singh, Delhi Airport, Gurmeet Kaur, Indiragandhi, Indoamerican-Telu

ఆయన తల్లి , రచయిత గుర్మీత్ కౌర్ కూడా అంగద్ బహిష్కరణపై ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో తప్పుబట్టారు.పంజాబ్‌లో వున్న మమ్మల్ని కలుసుకోవడానికి అమెరికా నుంచి ఢిల్లీకి 18 గంటల పాటు ప్రయాణించి వచ్చిన అంగద్ సింగ్‌ని అధికారులు బహిష్కరించి తిరిగి న్యూయార్క్‌కి పంపించారని గుర్మీత్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏం చేసినా తన కొడుక్కి మాతృభూమిపై వున్న ప్రేమను మాత్రం వారు అడ్డుకోలేరని ఆమె వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube