వసతి గృహ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలి:- PDSU డిమాండ్

సంక్షేమవస్తు గృహ విద్యార్థుల పట్ల ప్రభుత్వ ఉదాసినా వైఖరి వీడనడాలని తక్షణమే పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచాలని పిడిఎస్యు ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నామాల.ఆజాద్ వి.

 Mess Charges To Be Increased For Hostel Students Pdsu Demand-TeluguStop.com

వెంకటేష్ డిమాండ్ చేశారు.స్థానిక ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పి స్కూల్ నుండి సాంఘిక సంక్షేమ జిల్లా కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి ముట్టడి నిర్వహించడం జరిగింది.

అనంతరం జిల్లా సంక్షేమ అధికారి కస్తాల సత్యనారాయణ వచ్చి వసతి గృహ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మిస్ చార్జీలు పెంచకపోవడం వల్ల నాణ్యమైనటువంటి ఆహారం అందించకపోవడం వల్ల విద్యార్థులు పౌష్టిక ఆహార లోపంతో అనారోగ్యాలకు కారణమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హాస్టల్స్ ప్రారంభమై మూడు నెలలు అవుతున్న ఇప్పటివరకు మెనూ చాట్ ఏర్పాటు చేయని దీనవస్థలో ప్రభుత్వము ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో మంత్రి హరీష్ రావు గారు ఆంధ్ర విద్యార్థులకు స్కాలర్షిప్ రేయంబర్స్మెంట్ ఇవ్వము, అవసరమైతే మా తెలంగాణా విద్యార్థులకు పాకెట్ మనీ వెయ్యి రూపాయలు ఇస్తామని ప్రకటించి నేటికీ ఆరు సంవత్సరాల నాలుగు నెలలు పూర్తవుతున్న అమలు కాని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందన్నారు.

ఎన్ఎస్పి కాలనీలో బాలుర వస్తి గృహం కాంపౌండ్ వాల్ కూలి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న నేటికీ నిర్మించక పోవడం వల్ల హాస్టల్లోకి పందులు, కుక్కలు, పాములు కూడా వచ్చి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఎప్పుడు ఏమి జరుగుతుందో అని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.సంక్షేమ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పూర్తి చేస్తాం అంటున్నారే కానీ మొదలుపెట్టే పరిస్థితి లేదన్నారు.

రెండు సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఇవ్వవలసిన ట్రంకు పెట్టెలు, ప్లేట్స్, గ్లాసులు, నేటికీ ఇవ్వకపోగా విద్యార్థులకు ఇవ్వవలసిన దుస్తులు,చెప్పులు, షూస్ విద్యార్థులకు అందని దయనీయస్థితిలో సంక్షేమ వ్యవస్థ ఉందని వారు విమర్శించారు.హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు 3500 రూపాయలు,కాస్మొటిక్ చార్జీలను 500, ఇంటర్ ఆపై విద్యార్థుల కు పాకెట్ మనీ 1000 రూపాయలు తక్షణమే ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రతి హాస్టల్ కు ఒక ANM ను నియమించి ఆరోగ్య పరీక్షలు ప్రతి నెల నిర్వహించి, ఫస్ట్ ఎయిడెడ్ బాక్స్ లో ఏర్పాటు చేయాలన్నారు.తక్షణమే వసతి గృహ సమస్యల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించాలని లేనియెడల దశల వారి ఆందోళనకు సిద్ధమవుతావని వారు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు ఖమ్మం జిల్లా నాయకులు దీపిక, సతీష్ డివిజన్ నాయకులు కార్తీక్, మల్సూర్, కరుణ, నవ్య,మౌనిక, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube