పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ మూవీ ఈరోజు థియేటర్లలో విడుదలైంది.అటు పూరీ జగన్నాథ్ అభిమానులకు ఇటు విజయ్ దేవరకొండ అభిమానులకు ఈ సినిమా ఎంతగానో నచ్చింది.
విజయ్ దేవరకొండకు జోడీగా ఈ సినిమాలో అనన్య పాండే నటించారు.అయితే సాధారణ అభిమానుల నుంచి మాత్రం ఈ సినిమాకు నెగిటివ్ రెస్పాన్స్ వస్తుండటం గమనార్హం.
విజయ్ దేవరకొండ తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడని ఈ సినిమా కమర్షియల్ గా ఆడుతుందని కొంతమంది చెబుతుండగా కథ, కథనం మాత్రం యావరేజ్ గా ఉన్నాయని మరి కొందరు చెబుతున్నారు.నటుడిగా విజయ్ దేవరకొండ బెస్ట్ ఇచ్చాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఫస్టాఫ్ పరవాలేదని సెకండాఫ్ మాత్రం అస్సలు బాలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయని మరొకరు అభిప్రాయం వ్యక్తం చేశారు.బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బెస్ట్ మూవీ అని అనన్య పాండే అందంగా కనిపించడంతో పాటు మైక్ టైసన్ అద్భుతమైన పాత్రను పోషించాడని నెటిజన్లు చెబుతున్నారు.స్టోరీ, స్క్రీన్ ప్లే విషయంలో తప్పు జరిగిందని నెటిజన్లు చెబుతున్నారు.
విజయ్ దేవరకొండ కోరుకున్న సక్సెస్ అయితే దక్కలేదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.విజయ్ దేవరకొండ మాత్రమే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని మిగతావన్నీ మైనస్ అని నెటిజన్లు చెబుతున్నారు.
విజయ్ దేవరకొండ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సినిమాసినిమాకు విజయ్ దేవరకొండకు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.
అయితే కథల విషయంలో విజయ్ దేవరకొండ జాగ్రత్త వహించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.విజయ్ దేవరకొండ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.







