వచ్చే ఏడాది నాటికి సుమారు 7 లక్షల ప్రవాస ఉద్యోగులను తొలగించనున్నట్టుగా కువైట్ దేశం ప్రకటించింది.కువైట్ గడిచిన ఏడాదిగా తమ దేశంలో పనిచేస్తున్న ప్రవాస కార్మికులను నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుంచీ తొలగిస్తున్న విషయం అందరికి తెలిసిందే.
ఈ మధ్య కాలంలో కూడా కువైట్ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న ప్రవాసులను సైతం తొలగించడంతో ప్రవాసులు అందరూ ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలోనే కువైట్ ప్రభుత్వం మరో షాకింగ్ న్యూస్ ప్రకటించింది.
కువైటైజేషన్ లో భాగంగా స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఎంతోమంది ప్రవాసులను ప్రభుత్వ , ప్రవైటు రంగాలలో ఉన్నవారిని ఉద్యోగాల నుంచీ తొలగిస్తున్న కువైట్ ప్రభుత్వం 2017 లో తీసుకువచ్చిన కువైటైజేషన్ పాలసీని మరింత వేగంగా అమలు చేయడానికి సిద్దమవుతోంది.ఈ క్రమంలోనే తాజాగా ప్రవాసులు ఉలిక్కిపడేలా షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది.
వచ్చే ఏడాది నాటికి సుమారు 7 లక్షల 50 వేల మందిని ఉద్యోగాల నుంచీ తొలగించి వారి స్థానంలో కువైట్ వాసులకు ఆయా ఉద్యోగాలు కట్టబెట్టనుందట.అయితే.

తొలగించడానికి సిద్దంగా ఉన్న ఈ 7 లక్షలపై ఉద్యోగాలు కేవలం ఈజిప్ట్ దేశానికి చెందిన ప్రవాస కార్మికులవని తెలుస్తోంది.వీరిలో సుమారు 2.50 లక్షల మంది కార్మికులను వచ్చే నెలాఖరు కు తొలగించనున్నారట.వచ్చే ఏడాదికి మరో 5 లక్షల మందికి ఉద్వాసన పలుకుతారని తెలుస్తోంది.
కువైట్ కార్మికులు మొత్తంలో 77 శాతం మంది ప్రవాస కార్మికులు ఉండగా, కేవలం 22 శాతం మంది మాత్రమే కువైటీలు ఉన్నారని, కువైటైజేషన్ పాలసీ కారణంగా ఇప్పుడు కువైటీల శాతం భారీగా పెరగ నుందని తెలుస్తోంది.ఇదిలాఉంటే కువైట్ లో అత్యధిక శాతం ప్రవాస కార్మికులుగా ఈజిప్ట్ వాసులు 24 శాతం మందితో అగ్ర స్థానంలో ఉన్నారని, ఆ తరువాత 23.7 శాతం తో భారతీయ కార్మికులు ఉన్నారని గణాంకాలు చెప్తున్నాయి.దాంతో ఈజిప్ట్ వాసులను తొలగించిన తరువాత తమ వంతు ఎక్కడ వస్తుందోనని భారతీయ కార్మికులు ఆందోళన చెందుతున్నారు.







