సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవ లే గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.మహేష్ బాబు ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు.
ఇక ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా తర్వాత మహేష్ బాబు అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు.ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా కోసం రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేసాడు.ఈ సినిమా అడవుల బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ కావడంతో రాజమౌళి ప్రతీది పర్ఫెక్ట్ గా ఉండాలని.
అలాగే భారీ తారాగణం, విదేశీ సాంకేతిక నిపుణులు కూడా తప్పకుండ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా బడ్జెట్ కూడా అదే స్థాయిలో ఉండనుందని వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా కోసం 500 నుండి 600 కోట్ల బడ్జెట్ ఉంటుంది అని టాక్ ఒకటి వినిపిస్తుంది.ఈ సినిమాను పాన్ ఇండియాను మించేలా తెరకెక్కించడానికి రాజమౌళి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు.

ఈ సినిమాకు కూడా కీరవాణి సంగీతం అందించనున్నాడు.
ఇక తాజాగా ఈ సినిమా నుండి మరొక బజ్ వినిపిస్తుంది.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.మరి తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ సినిమా వచ్చే ఏడాది 2023 జనవరి లాస్ట్ వీక్ లో గ్రాండ్ గా లాంచ్ చేయడానికి గట్టి ప్లాన్ చేస్తున్నారని.
ఈ మధ్య సమయంలో ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలనీ రాజమౌళి పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారట.చూడాలి మరి ఈ సినిమా లాంచింగ్ ఎప్పుడు అవుతుందో.







