షర్ట్ లేకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు.. లేడీ ఫ్యాన్స్ కు పిచ్చెక్కేలా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.గత కొన్నేళ్లుగా మహేష్ నటించిన ప్రతి సినిమా సక్సెస్ సాధిస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

 Mahesh Babu Shirtless Photos Goes Viral In Social Media Details, Mahesh Babu , M-TeluguStop.com

అయితే తాజాగా నమ్రత మహేష్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు ఇప్పటికే షర్ట్ విప్పి బాడీ ప్యాక్స్ ను చూపిస్తూ ప్రేక్షకుల మెప్పు పొందారు.

అయితే మహేష్ బాబు మాత్రం షర్ట్ లేకుండా కనిపించడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేసినా కొన్ని కారణాల వల్ల ఆ విషయంలో వెనక్కు తగ్గాల్సి వచ్చిందని మహేష్ బాబు ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.

అయితే నమ్రత మహేష్ ఫిట్ బాడీ పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.మహేష్ బాబు స్విమ్మింగ్ పూల్ లో ఉన్న సమయంలో తీసిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

నమ్రత ఈ ఫోటోలను షేర్ చేయడంతో పాటు టు కూల్ ఫ‌ర్ ది పూల్ అంటూ ఈ ఫోటోలకు హ్యాష్ ట్యాగ్ పెట్టారు.

మరోవైపు మహేష్ బాబు తర్వాత సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది.

Telugu Mahesh Babu, Maheshbabu, Namratha, Pooja Hegde, Shirtless-Movie

షూటింగ్ మొదలుకాకముందే ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తి కాగా మహేష్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తున్నారు.

థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు.పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం అందుతోంది.మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube