టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సమంత ప్రస్తుతం బోలెడు సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది.
కాగా ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.అయితే కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది సమంత.
ఈమెకు ఇన్స్టాగ్రామ్,ట్విట్టర్ లో మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉన్న విషయం తెలిసిందే.తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత ఏదో రకమైన పోస్టులు లేదా ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది.
ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో సమంత సోషల్ మీడియా వాడకం తగ్గించినట్లు కనిపిస్తోంది.
అయితే ఈమె గత ఏడాది నాగ చైతన్యతో విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే.
అయితే విడాకులు తర్వాత సమంత కెరిర్ చాలావరకు ఆగిపోతుంది అని అందరూ భావించారు.కానీ విడాకుల తర్వాత సమంత సినిమాల పరంగా మరింత బిజీ అయింది.అలాగే ఎప్పటిలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ ఏదో రకమైన పోస్టులను పెడుతూనే ఉంది.ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్ లో పెద్దగా కనిపించడం లేదు.
అప్పుడప్పుడు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ కు సంబంధించి పెయిడ్ పోస్టులు మాత్రమే పెడుతోంది.

అలాగే ఇంస్టాగ్రామ్ స్టోరీలలో కేవలం బర్త్ డే విషెస్ లు పెడుతూ వస్తోంది.అయితే ఇంస్టా వాడకాన్ని తగ్గించిన సామ్ అప్పుడప్పుడు ట్విట్టర్ ని ఉపయోగిస్తోంది.దీన్ని బట్టి చూస్తే ఆమె సోషల్ మీడియాలో కాకుండా కెరీర్ మీద బాగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
అందువల్లే ఇంస్టాగ్రామ్ కు కొంతకాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని సమాచారం.ఇక సమంత సినిమాల విషయానికొస్తే.సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.అలానే యశోద సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.







