ఈ చిట్కాలు పాటించడం ద్వారా మీ లెదర్ హ్యాండ్ బ్యాగ్ ని ఎన్నేళ్ళైనా కాపాడుకోవచ్చు!

మగువలకు ఇష్టమైన షాపింగ్ లో మొదటి వరుసలో ఉండేవి హ్యాండ్ బ్యాగ్స్.అవును… వీరు తమ హ్యాండ్ బ్యాగ్స్ కోసం ఎంతైనా వెచ్చిస్తూ వుంటారు.ముఖ్యంగా కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ముందుగా వారు కొనేది హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే.అందులోనూ వారికీ లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ అంటే మక్కువ ఎక్కువ ఉంటుంది.

 By Following These Tips You Can Preserve Your Leather Handbag For Years , Leathe-TeluguStop.com

ఎందుకంటే వీటి మన్నిక ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి.అయితే మనలో అనేకమందికి నిజానికి లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ ఎలా వాడాలో తెలియని తెలియదు.

ఓ సాధారణ హ్యాండ్ బ్యాగ్స్ మాదిరి వాటిని ట్రీట్ చేస్తే కుదరదు.అవి ఎంతోకాలం మన్నవు.

ఈ క్రింది పద్ధతులను ఉపయోగించడం ద్వారా మీరు మీ లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ ని ఎక్కువకాలం పాటు సురక్షితంగా కాపాడుకోగలుగుతారు.

1.మీ లెదర్ బ్యాగ్‌ని ఉపయోగించిన తర్వాత అంటే బయటకి వెళ్లి, ఇంటికి వచ్చిన తర్వాత, అందులోని వస్తువులను తీసివేసి, బ్యాగ్‌ను వేరే చోట ఖాళీగా ఉంచాలి.

2.ఒకవేళ బ్యాగ్ మురికిగా ఉందని, మీకు అనిపిస్తే దాన్ని డైరెక్ట్ గా కడగాలని ప్రయత్నించవద్దు.ఒక బకెట్‌లో వేడి నీటిలో సబ్బు పొడిని కలపండి.ఆ తరువాత తడి గుడ్డ తీసుకుని మీ బ్యాగ్ తుడవండి.

3.అలాగే మీ లెదర్ బ్యాగ్ వర్షంలో బాగా తడిసిపోయింది, అనుకుంటే దాన్ని అలాగే వదిలేసి, కాటన్ బాల్‌లో కాస్త ఆల్కహాల్ ముంచి, ఒకసారి బ్యాగ్ మొత్తం తుడిచి, తర్వాత మరో పొడి గుడ్డతో తుడవాలి.

4.ఇక తోలు సంరక్షణ కోసం అనేక ఉత్పత్తులు మార్కెట్లో వున్నాయి.బ్యాగ్‌ను రక్షించడానికి మీరు దుకాణంలో కొనుగోలు చేసిన లెదర్ పాలిష్‌లను కూడా ఉపయోగించవచ్చు.

5.మీ లెదర్ బ్యాగ్ పైన ఏవైనా మరకలను తొలగించడానికి మరొక ఉపాయం వుంది.అదే నెయిల్ పాలిష్ రిమూవర్.ఇది అమ్మాయిల వద్ద ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి కేవలం తడిసిన ప్రదేశంలో అప్లై చేసి రుద్దండి.సరిపోతుంది.

6.ఒకవేళ మీదగ్గర పైన చెప్పిన వస్తువులు లేకపోయినట్లయితే… మరకలు పోవడానికి నూనె మరియు బేకింగ్ సోడా కలిపి మరకపై రుద్దితే ఫలితం ఉంటుంది.

పైన చెప్పిన విధంగా మీరు మీ లెదర్ హ్యాండ్ బ్యాగులను సంవత్సరాలపాటు సంరక్షించుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube