నేను బ్రతికుండగానే నా కూతురు చనిపోవాలి.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్?

ఈ సృష్టిలో తల్లిని మించిన దైవం లేదు.తల్లి ప్రేమకు ఏది సాటి రాదని చెప్పాలి.

 Senior Actress Indu Anand Shocking Comments About Her Daughter Health Details,-TeluguStop.com

తన కన్న బిడ్డల కోసం తల్లి ఎంతో కష్టపడుతూ తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది.ఇలా ఎప్పటికప్పుడు తన బిడ్డలపై తనకున్న ప్రేమను చాటుతూ మాతృత్వానికి ఏ ప్రేమ సాటి లేదని నిరూపించుకుంటుంది.

తన బిడ్డ జీవితంలో ఎదగాలని ఆ ఎదగదలను చూడాలని ప్రతి తల్లి కోరుకుంటుంది కానీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇందు ఆనంద్ మాత్రం తను బ్రతికుండగానే తన కూతురు చనిపోవాలని కోరుకుంది.

బహుశా ఏ తల్లి కూడా ఇలా కోరుకోదు అయితే ఈమె బ్రతికుండగానే తన చేతుల మీద గానే తన కూతురు చనిపోవాలని కోరుకోవడానికి గల కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.

ఇందు ఆనంద్ పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె మొగలిరేకులు చక్రవాకం వంటి సీరియల్ లో కూడా కీలక పాత్రలలో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు.ఇక ఈమె తండ్రి వృత్తిరీత్యా ఆర్మీ ఉద్యోగి కావడంతో వివిధ రాష్ట్రాలు తిరుగుతూ బాల్యం గడిచిపోయింది అని ఈమె తెలిపారు.

ఇక పెళ్లయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఆమెకు తన భర్త ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇకపోతే ఈమె వయసు పెరుగుతున్న కొద్ది సినిమాలలో ఇప్పటికీ ఇండస్ట్రీలో కష్టపడుతూ ఉన్నారు.

Telugu Chakravakam, Characterartist, Indu Anand, Mogilireku, Senioractress, Toll

అయితే ఈ వయసులో కూడా తాను కష్టపడటానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.ఈ వయసులో కూడా తాను తన కూతురు కోసమే కష్టపడుతున్నానని తెలిపారు.తన కూతురు పుట్టుకతోనే మతిస్థిమితం లేని అమ్మాయిగా పుట్టింది.అయితే తన కూతురుకు ఏ లోటు లేకుండా చూసుకోవడం కోసమే తాను ఇప్పటికీ కష్టపడుతున్నానని ఈమె తెలిపారు.

తన భర్త మరణం తర్వాత తనకు మరింత బాధ్యత పెరిగిందని అందుకే తాను ఇప్పటికీ కష్టపడుతున్నానని తెలియజేశారు.

Telugu Chakravakam, Characterartist, Indu Anand, Mogilireku, Senioractress, Toll

ఇలా తన కూతురు పెరిగి పెద్దదైనప్పటికీ తన ఎదుగుదలలో మార్పు రాకపోవడంతో అన్ని తానే చూసుకుంటున్నానని తెలిపిన ఈమె తాను మరణించడానికి ముందుగానే తన చేతిలో తన కూతురు మరణించాలని కోరుకున్నారు.తాను చనిపోయిన తర్వాత తన కూతురిని బాధ్యతగా ఎవరు చూసుకోరని,తల్లి తోడు లేకుండా మానసిక ఎదుగుదలలేని అమ్మాయి బ్రతకడం చాలా కష్టమని అందుకే తనకంటే ముందుగా తన కూతురే చనిపోవాలని ఈమె కోరుకున్నారు.ఇలా చావులో కూడా ఈ నటి తన అమ్మ ప్రేమను చూపించారు.

ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube