బాలకృష్ణ, అనిల్ రావిపూడి #NBK108కి మ్యూజికల్ సెన్సేషనల్ థమన్ మ్యూజిక్, నిర్మాతలు షైన్ స్క్రీన్స్ బ్యానర్

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, డబుల్ బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి తొలిసారిగా జతకడుతున్న క్రేజీ కాంబినేషన్ కు సర్వం సిద్ధమైయింది.#NBK108 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని బాలకృష్ణ పుట్టినరోజున అధికారికంగా ప్రకటించారు.ఈరోజు చిత్ర నిర్మాతలు, సంగీత దర్శకులకు సంబధించిన ప్రకటన వచ్చింది.

 Shine Screen Productions Banner To Produce Balakrishna Anil Ravipudi Nbk108 Mov-TeluguStop.com

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.

ఈ చిత్రానికి స్టార్ సెన్సేషనల్ కంపోజర్ ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో బాలకృష్ణ, అనిల్ రావిపూడి , ఎస్ థమన్ కాంబినేషన్ ఖచ్చితంగా చరిత్ర సృష్టించడం ఖాయం.

అనిల్ రావిపూడి, థమన్ కలసిపని చేయడం ఇదే తొలిసారి.కాగా, బాలకృష్ణ సెన్సేషనల్ హిట్ అఖండకు థమన్ బ్లాక్ బస్టర్ సంగీతాన్ని అందించారు.

ఈ సందర్భంగా “త్వరలో బాంబార్డింగ్…” అంటూ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభానికి సంబంధించి అనౌన్స్ మెంట్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్.అనౌన్స్ మెంట్ వీడియోకి తమన్ ఇచ్చిన బిజీయం మ్యూజిక్ బ్రిలియంట్ గా వుంది.

అనౌన్స్ మెంట్ బిజీఎంనే అదిరిపోయిందంటే.సినిమాలో ఏ స్థాయిలో వుంటుందనే ఎక్సయిట్మెంట్ ప్రేక్షకుల్లో కలిగించారు.

మాస్‌ పల్స్‌ తెలిసిన అనిల్‌ రావిపూడి బాలకృష్ణ కోసం విభిన్నమైన, మాస్‌ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు.నటసింహ నందమూరి బాలకృష్ణని మునుపెన్నడూచూడని పాత్రలో చూపించబోతున్నారు.

ఇందులో ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తుంది.#NBK108 కోసం అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేయబోతున్నారు.

తారాగణం:

నందమూరి బాలకృష్ణ

సాంకేతిక విభాగం

రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి, నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది, బ్యానర్: షైన్ స్క్రీన్స్, సంగీతం: ఎస్ థమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ, పీఆర్వో: వంశీ-శేఖర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube