మన టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు ఇది వరకుతో పోల్చితే ఇప్పుడు కాస్త లైమ్ లైట్ లోకి రావడానికి ఇష్టపడుతున్నారు.ఇంతకు ముందు మన టాలీవుడ్ హీరోల భార్యలు వారిపై ఫోకస్ పడేందుకు ఒప్పుకునే వారు కాదు.
కానీ ఇప్పుడు కాస్త ట్రెండ్ మారుతుంది.వారు కూడా తమను తాము కొత్తగా అందంగా పరిచయం చేసుకుంటున్నారు.
సోషల్ మీడియాను వేదికగా చేసుకుని వారు ప్రతి నిత్యం ఫాలోవర్స్ కు చేరువలో ఉంటున్నారు.అల్లు అర్జున్ భార్య స్నేహ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే.
ఈమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్లు కూడా ఎక్కువుగానే ఉంటారు.తమ లైఫ్ లో జరిగే ప్రతి మూమెంట్ ను స్నేహ సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్లతో పంచుకుంటుంది.
ఇక తాజాగా స్నేహ తన కొత్త ట్రెడిషనల్ లుక్ ను అందరికి పరిచయం చేసింది.స్నేహ పూర్తి సాంప్రదాయ బద్ధంగా ట్రెండీ శారీ లుక్ తో టాప్ టు బాటమ్ డిజైనర్ లుక్ తో మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఈమె కొత్త ఫోటో షూట్ లో సంప్రదాయంగా చీరలో ఉన్న ఈ లుక్ చూసి ఫ్యాన్స్ స్వీటెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.బుట్టబొమ్మ అంటూ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో అల్లు ఫ్యాన్స్ సందడి షురూ చేసారు.

ఇక ఇది పక్కన పెడితే అల్లు అర్జున్ ప్రెసెంట్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా ఎర్రచందనం స్మగ్లర్ గా నటిస్తుంటే.రష్మిక పుష్పరాజ్ భార్యగా శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది.ఇక ఈ సినిమా పార్ట్ 1 సెన్సేషనల్ హిట్ అయినా విషయం విదితమే.అందుకే అందరు పార్ట్ 2 కోసం ఎదురు చూస్తున్నారు.







