సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగిన సెలబ్రిటీలు చాలామందే ఉన్నారు.వాళ్లలో కొంతమంది ఆఫర్లు తగ్గి సినిమా ఇండస్ట్రీకి దూరమైతే మరి కొందరు మాత్రం హఠాత్తుగా మరణించి అభిమానులకు బాధను మిగిల్చారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన ఆర్తి అగర్వాల్ నువ్వు నాకు నచ్చావ్ సినిమాతోనే స్టార్ స్టేటస్ ను అందుకున్నారు.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లకు జోడీగా నటించి ఆమె ప్రశంసలు అందుకున్నారు.
సునీల్ కు జోడీగా ఆర్తి అగర్వాల్ నటించిన అందాల రాముడు సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలవగా ఈ సినిమాతో సునీల్ కు స్టార్ స్టేటస్ దక్కింది.బరువు తగ్గడానికి చేయించుకున్న సర్జరీ వికటించడంతో ఆర్తి అగర్వాల్ మృతి చెందారు.
తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా యువత హృదయాలను గెలుచుకున్న ప్రత్యూష 30 సంవత్సరాల వయస్సు దాటకుండానే ఆత్మహత్య చేసుకోవడం ద్వారా మృతి చెందారు.
ప్రత్యూష మృతి విషయంలో ఆమె తల్లి ఇప్పటికీ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
టాలెంటెడ్ హీరో ఉదయ్ కిరణ్ కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సాధించినా తర్వాత కాలంలో సక్సెస్ లేక ఇబ్బందులు పడ్డారు.ఒక్క సక్సెస్ సాధించి ఉంటే మాత్రం ఉదయ్ కిరణ్ కెరీర్ పుంజుకుని ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మరో స్టార్ హీరోయిన్ సౌందర్య 100 కంటే ఎక్కువ సినిమాలలో నటించి నటిగా ఒక వెలుగు వెలిగారు.
అయితే ఊహించని విధంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో సౌందర్య మృతి చెందారు.సౌందర్య మరణం అభిమానులను ఎంతగానో బాధ పెడుతోంది.మరో హీరోయిన్ దివ్యభారతి ఆత్మహత్య కూడా అభిమానులను ఎంతగానో బాధపెట్టింది.
సిల్క్ స్మిత కూడా హఠాత్తుగా మృతి చెందగా ఆమె మరణం కూడా ప్రేక్షకులను షాక్ కు గురి చేసింది.ఈ సెలబ్రిటీలు మరణించి చాలా కాలమైనా ప్రేక్షకుల హృదయాలలో మాత్రం వీళ్లు నిలిచిపోయారు.