దుల్కర్ సల్మాన్, వైజయంతీ మూవీస్ 'సీతారామం' గ్రాండ్ ఈవెంట్

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకంగా చిత్రం ‘సీతారామం’.రష్మిక మందన కీలక పాత్ర పోహిస్తున్నారు.

 Dulquer Salmaan, Vyjayanthi Movies 'sitaharam' Grand Event , Dulquer Salmaan, Mr-TeluguStop.com

హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి.విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులని మెస్మరైజ్ చేసి చార్ట్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.ఆగస్ట్5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ “విశాఖ తీరం లో సీతారామం” గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది.వేలాదిమంది అభిమానులు పాల్గొన్న ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది.ఈ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, సుమంత్, తరుణ్ భాస్కర్ పాల్గొన్నారు.ఈ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్ వేదికపై ఇందందం పాట పాడి అభిమానులని అలరించారు.

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.

అభిమానులందరికీ నా ప్రేమ.మహానటి సినిమాలో భాగం కావడం నా అదృష్టం.‘అమ్మాడి’ అనే ఒక్క మాటతో మీ అందరి మనసులో చోటు సంపాయించుకున్నాను.వైజాగ్ బీచ్ లో రోడ్ షోలా చేద్దామని అనుకున్నప్పుడు ఎవరైనా వస్తారా ? అనుకున్నాను.కానీ ఆలోచన తప్పని మీ ప్రేమ నిరూపించింది.మీ ఇంత గొప్ప ప్రేమని పొందిన నేను అదృష్టవంతుడ్ని.తెలుగు సినిమాలు చేస్తూనే వుంటాను.సీతారామం అద్భుతమైన దృశ్యం కావ్యం.

ఆగస్ట్ 5న థియేటర్ కి వస్తోంది.మీరంతా తప్పకుండా థియేటర్లో సినిమా చూడాలి” అని కోరారు.

మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ .ఇంతమంది అభిమానుల ప్రేమని నా కెరీర్ లో ఎప్పుడూ చూడలేదు.లవ్ వైజాగ్.నాకు ఇంతకంటే గొప్ప ఆరంగేట్రం దొరకదు.వైజయంతి మూవీస్, దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి .ఇంత గొప్ప టీంతో పని చేయడం మర్చిపోలేని అనుభూతి.సీతారామం అద్భుతమైన చిత్రం.ఆగస్ట్ 5న మీరంతా మీ ప్రియమైనవారు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి ఈ సినిమా చూడాలి’ అని కోరారు.

సుమంత్ మాట్లాడుతూ .నా కెరీర్ లో తొలిసారి చాలా కీలకమైన సపోర్టింగ్ రోల్ సీతారామంలో చేశాను.ట్రైలర్ లో కొంచెమే చూశారు.కావాలనే కొంచెం చూపించాం.నేను సినిమాలో ఏం చేస్తానో అనేది మిస్టరీగా వుంటుంది.ఆగస్ట్ 5న బంగారం లాంటి సినిమా మీ ముందుకు వస్తుంది.

ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.ఆగస్ట్ 5 న అందరం థియేటర్ లో కలుద్దాం” అన్నారు.

తరుణ్ భాస్కర్ .మీరు చూపించే ప్రేమకు ఇక్కడే సినిమా తీయాలనిపిస్తుంది.ప్రతిసారి మళ్ళీ మళ్ళీ వైజాగ్ రావాలనిపిస్తుంది.ఆగస్ట్ 5 న సీతారామం వస్తుంది.అందరం థియేటర్ లో కలుద్దాం” అన్నారు.సీతారామం ఆగస్ట్ 5న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది

తారాగణం: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, భూమిక చావ్లా ప్రకాష్ రాజ్ తదితరులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube