అవకాశాల్లేక వేణు చికెన్ కొట్టు పెట్టుకున్నాడట.. హీరోయిన్ తో ఎఫైర్ కూడా?

సాధారణంగా సినిమా హీరోలు అన్న తర్వాత వారిపై ఎన్నో పరకాల వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే.ఒక వైపు ఇండస్ట్రీ లో బిజీగా ఉన్న హీరో లకు సంబంధించి మరోవైపు ఇండస్ట్రీలో అవకాశాలు లేక కనుమరుగైన హీరో లకు సంబంధించి వార్తలు ఎప్పుడూ తెర మీదికి వస్తూనే ఉంటాయి.

 Hero Venu Tottempudi Early Days Struggle Details, Venu Tottempudi, Hero Venu Tot-TeluguStop.com

అయితే గత కొంత కాలం నుంచి వేణు తొట్టెంపూడి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా మారి పోతున్నాయ్ అన్న విషయం తెలిసిందే.

స్వయంవరం అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన వేణు తొట్టెంపూడి ఆ తర్వాత ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలను తీసి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం ఎందుకో ఇండస్ట్రీలో పోటీ తట్టుకోలేక పోయాడు.అవకాశాలు కూడా తగ్గిపోయాయి.దీంతో హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు.ఎన్టీఆర్, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన దమ్ము సినిమాలో నటించాడు.

ఇక ఈ పాత్ర అతనికి పెద్దగా కలిసి రాలేదు.తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇక తన వ్యాపారాలపై దృష్టి పెట్టాడు.

కానీ ఇప్పుడు ఆరేళ్ల గ్యాప్ తర్వాత రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో ప్రేక్షకుల వచ్చేసాడు.

Telugu Dhammu, Venu, Venu Tottempudi, Laya, Rama Rao Duty, Swayamvaram, Venutott

అయితే ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇక తన గురించి వచ్చిన కొన్ని వార్తల గురించి ప్రస్తావించాడు.తాను అవకాశాలు లేక బ్రతుకుతెరువుకోసం చికెన్ కొట్టు పెట్టుకున్నానని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఇక ఈ వార్తలు వచ్చినప్పుడు కొంతమంది స్నేహితులు నాకు ఫోన్ చేసి సరదాగా చికెన్ ఇంటికి తీసుకు రా అంటూ కామెంట్ చేశారు అంటూ గుర్తు చేసుకున్నాడు.

అంతేకాదు తన మొదటి సినిమా స్వయంవరం హీరోయిన్ లయ తో తనకు ఎఫైర్ ఉందని వార్తలు కూడా వచ్చాయి.కానీ అవేవి నేను పట్టించుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube