1.రన్ వే ఫై జారిపడిన ఇండిగో విమానం

విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో రన్ వే పై జారిపోవడంతో ఎయిర్ ఇండియా విమాన సర్వీసు ను అధికారులు రద్దు చేశారు.ఈ ఘటన అసోం లోని జోర్ హట్ లో జరిగింది.
2.భారత్ లో కరోనా
గడిచి 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 20,409 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
3.చంద్రబాబును కలిసిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే

టిడిపి అధినేత చంద్రబాబును తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్య కలిశారు.ఏపీలోని ముంపు గ్రామాలను తెలంగాణలో కలిపేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
4.కేజ్రీవాల్ ఆహ్వానాన్ని ఉపసంహరించుకున్న సింగపూర్
వరల్డ్ సిటీస్ సమ్మిట్ 2002 సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కు సింగపూర్ ప్రభుత్వం పలికిన ఆహ్వానాన్ని ఉపసంహరించుకుంది.
5.జగన్ పై చంద్రబాబు కామెంట్స్

ఏపీ విలీన మండలాల్లో ఈరోజు చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.నెల్లిపాక గ్రామంలో వరద బాధితులను పరామర్శించిన చంద్రబాబు అనంతరం మాట్లాడుతూ జగన్ కురత్వాన్ని ప్రజలు గ్రహించాలని బాబు కోరారు.
6.బిజెపి వినూత్న నిరసన
భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పై కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఖైరతాబాద్ టీజేఆర్ సర్కిల్లో బిజెపి నిరసన చేపట్టింది.గిరిజన మహిళలు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
7.భద్రాచలం కరకట్ట పరశీలించిన చంద్రబాబు

భద్రాద్రి రామయ్య దర్శనం అనంతరం టిడిపి అధినేత చంద్రబాబు భద్రాచలం కరకట్టను పరిశీలించారు.
8.శ్రావణ మాస ఉత్సవాలు
భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
9.నేడు నగరంలో ఉపరాష్ట్రపతి పర్యటన

నేడు హైదరాబాద్ నగరంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటిస్తున్న నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
10.కేసీఆర్ కు కిషన్ రెడ్డి లేఖ
సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు హైదరాబాదులో సైన్స్ సిటీ ఏర్పాటు విషయమై లేఖలో ప్రస్తావించారు.ఇది నాలుగో సారి రాసిన లేఖ అంటూ సెటైర్లు వేశారు.
11.ప్రపంచ పులుల దినోత్సవం

నేడు ప్రపంచ పుల్లల దినోత్సవం ను దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు నిర్వహిస్తున్నాయి.
12.పార్లమెంట్ సమావేశాలు
నేడు పదో రోజు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
13.జగన్ పర్యటన

సీఎం జగన్ నేడు కాకినాడ జిల్లా గొల్లప్రోలు లో పర్యటిస్తున్నారు.
14.బిజెపి పాదయాత్ర
నేటి నుంచి బిజెపి మనం మన అమరావతి పేరుతో అమరావతి పరిసర గ్రామాల్లో పాదయాత్ర చేపట్టింది.
15.నేడు అన్నవరం కు అరుణాచల్ ప్రదేశ్ సీఎం

నేడు అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు రేపు స్వామివారిని ఆయన దర్శించుకుంటారు.
16.తెలంగాణలో కరోనా
గడిచిన 24 గంటలు తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 836 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
17.నేడు రాజమండ్రి కోర్టు కు ఎంఎల్సి అనంత బాబు

నేడు రాజమండ్రి కోర్టు కి ఎంఎల్సి అనంతబాబు ని పోలీసులు హాజరుపరిచారు.
18.జర్నలి్స్ట్ కుటుంబానికి లక్ష సాయం
ఇటీవల వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయి మృతి చెందిన టీవీ జర్నలిస్ట్ జమీర్ కుటుంబానికి లక్ష ఆర్థిక సాయాన్ని గల్ఫ్ ఎన్.ఆర్.ఐ శాఖ అందించింది.
19.సత్య దేవునికి వజ్ర కిరీటం బహుకరణ

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామికి 1.5 కోట్ల విలువైన వజ్ర కిరీటాన్ని కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన ఓ భక్తుడు కానుకగా అందించాడు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,200
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 51,490