సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల విషయంలో ఎంత డెడికేషన్ చూపిస్తాడో తన ఫ్యామిలీ తో స్పెండ్ చేయడానికి కూడా అంతే ఇష్ట పడతాడు.కొద్ది సమయం వచ్చిన ఫారెన్ ట్రిప్స్ కు వెళ్లి తన భార్య, పిల్లలతో ఎంజాయ్ చేస్తాడు.
ఆ తర్వాతనే కొత్త సినిమా స్టార్ట్ చేస్తాడు.అలా సర్కారు వారి పాట విజయం తర్వాత మొన్నటి వరకు యూరప్ అంతా ఫ్యామిలీతో చుట్టేసి వచ్చేసాడు.
నెల రోజుల పాటు ఫ్యామిలీతో స్పెండ్ చేసిన మహేష్ ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చాడు.
ఇక ఇంటికి వచ్చాక కూడా మహేష్ ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తున్నాడు.
నిన్నటికి నిన్న మహేష్ సోదరుడి తనయుడు బర్త్ డే అవ్వడంతో అక్కడ హ్యాపీ మూమెంట్స్ స్పెండ్ చేసిన మహేష్ ఫ్యామిలీ ఈ రోజు వారి ముద్దుల కూతురు సితార పుట్టిన రోజుతో వారి ఇంట్లో మరొక హ్యాపీ అకేషన్ కనిపిస్తుంది.ఈ సందర్భంగా మహేష్ తన ప్రేమంతా కలిపి సోషల్ మీడియా వేదికగా ముద్దుల కూతురు కు విషెష్ తెలిపారు.
మహేష్ గారాల పట్టి ఈ రోజు 10వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా మహేష్ విషెష్ తెలుపుతూ.ప్రపంచంలో బ్రైటెస్ట్ స్టార్ సితార మాకు తెలియకుండానే పదేళ్లు వచ్చేసాయి.
హ్యాపీ బర్త్ డే సితార, నా ప్రేమ ఎప్పటికి నిలిచి ఉంటుంది.అంటూ మహేష్ పోస్ట్ చేయగా ఇది కాస్త నెట్టింట వైరల్ అయ్యింది.

ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే.ప్రెసెంట్ మహేష్ బాబు తన 28వ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్నాడు.11 ఏళ్ల తర్వాత వీరి కలయికలో సినిమా రాబోతుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా షూటింగ్ ఆగష్టులో స్టార్ట్ కాబోతుంది.
ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేసారు.







