నయనతారకు పెళ్లి కలిసిరాలేదా.. ఏకంగా కోర్టు నోటీసులు రావడంతో?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన నయనతార ఈతరం హీరోయిన్లలో 75 కంటే ఎక్కువ సినిమాలలో నటించిన హీరోయిన్ కావడం గమనార్హం.చాలా సంవత్సరాల నుంచి విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న నయనతార ఈ ఏడాది విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.

 Legal Troubles For Nayanatara And Vignesh Shivan Details Here Goes Viral , Lega-TeluguStop.com

నయనతార పెళ్లి ఫోటోలు, వీడియోలను తమ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి నెట్ ఫ్లిక్స్ ఏకంగా 25 కోట్ల రూపాయలు చెల్లించడానికి సిద్ధమైందని గతంలో వార్తలు వచ్చాయి.

నయనతార పెళ్లి ఫోటోలు, వీడియోలకు సంబంధించిన హక్కులను ప్రముఖ ఓటీటీకి అమ్మేయడంపై కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేశారనే సంగతి తెలిసిందే.

అయితే పెళ్లి తర్వాత విఘ్నేష్ శివన్ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసుకునే దిశగా అడుగులు వేస్తోందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే తాజాగా ఇందుకు సంబంధించి నయన్ విఘ్నేష్ దంపతులకు కోర్టు నుంచి నోటీసులు వచ్చాయని కోలీవుడ్ మీడియా వర్గాల్లో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

వైరల్ అవుతున్న వార్తల గురించి నయనతార లేదా విఘ్నేష్ శివన్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.కొందరు నెటిజన్లు మాత్రం నయనతారకు పెళ్లి అచ్చిరాలేదా అనే సందేహాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

పెళ్లి తర్వాత తిరుపతిలో నయనతార చేసిన ఒక పని వల్ల విమర్శలు వ్యక్తమయ్యాయి.

Telugu Troubles, Nayanatara, Netflix, Vignesh Shivan-Movie

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ సంస్థ నుంచి నయనతారకు షాక్ తగిలే దిశగా అడుగులు పడుతున్నాయి.అయితే పెళ్లి తర్వాత కూడా నయనతారకు సినిమా ఆఫర్లు ఏ మాత్రం తగ్గలేదని 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ నుంచి 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి నయనతార రేంజ్ పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నయనతార తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube