ఎన్ఆర్ఐలకు శుభవార్త.. ఇకపై అమృత్‌సర్ నుంచి వాంకోవర్, శాన్‌ఫ్రాన్సిస్కోలకు ఫ్లైట్ కనెక్టివిటి

పంజాబ్‌కు చెందిన ఎన్ఆర్ఐలకు శుభవార్త.ఇకపై పంజాబ్‌లోని అమృత్‌సర్ విమానాశ్రయం నుంచి కెనడాలోని వాంకోవర్, అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లవచ్చు.

 Good News For Nri's Now, Fly To Vancouver, San Francisco From Amritsar Airport ,-TeluguStop.com

ఈ రెండు నగరాలకు ఇక్కడి నుంచి విమానాలు నడపాలని పలు విమానయాన సంస్థలు నిర్ణయించాయి.సింగపూర్ ఎయిర్‌లైన్స్, స్కూట్‌లు .వాంకోవర్, సీటెల్, లాస్ ఏంజెల్స్, సింగపూర్‌ విమానాశ్రయాలతో అమృత్‌సర్‌ను అనుసంధానించనున్నాయి.దీంతో గురురామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణీకుల తాకిడి పెరగడంతో పాటు పలుదేశాల్లో వున్న పంజాబీ ఎన్ఆర్ఐలకు మేలు కలుగుతుంది.

ఈ నిర్ణయాన్ని అమృత్‌సర్‌కు చెందిన ఫ్లై అమృత్‌సర్ సభ్యులు స్వాగతించారు.కరోనా మహమ్మారికి ముందు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి అమృత్‌సర్‌ను ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్‌తో సహా పలు గమ్యస్థానాలకు అనుసంధానించిందని గుర్తుచేశారు.

ఫ్లై అమృత్‌సర్ గ్లోబల్ కన్వీనర్ సమీప్ సింగ్ మాట్లాడుతూ.కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి అమృత్‌సర్ నుంచి విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయని తెలిపారు.

దీంతో ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా మార్కెట్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ విజయవంతమైందని ప్రశంసించారు.ఇప్పుడు నార్త్ అమెరికా విమాన ప్రయాణ మార్కెట్‌పై దృష్టి సారించారని సమీప్ సింగ్ అన్నారు.

వాంకోవర్, శాన్‌ఫ్రాన్సిస్కోలకు విమానాలను నడపడం దానిలో భాగమేనని ఆయన పేర్కొన్నారు.

Telugu Amritsar, Australia, Fly Vancouver, Nris, Los Angeles, Sanfrancisco, Seat

ఇకపోతే.ఫ్లై అమృత్‌సర్ ఇనిషియేటివ్ ఇటీవల స్కూట్ ఎయిర్‌లైన్స్ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.ఈ సందర్భంగా అమృత్‌సర్‌కు విమానాల సంఖ్యను పెంచాలని కోరింది.

వాంకోవర్, అమెరికా, ఆస్ట్రేలియాలోని ఇతర గమ్యస్థానాల నుంచి వచ్చే ప్రయాణీకుల కోసం సింగపూర్‌లో సుదీర్ఘ లే ఓవర్ సమయాన్ని సైతం తగ్గించాలని ఫ్లై అమృత్‌సర్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube