ఇవాళ జరగనున్న రాష్ట్రపతి ఎన్నికకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.అటు పార్లమెంట్ తోపాటు ఇటు ఆయా రాష్ట్రాల శాసనసభల ప్రాంగణాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.
పార్లమెంట్ ఉభయసభల సభ్యులు పార్లమెంట్ భవనంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయనుండగా, రాష్ట్రాల ఎమ్మెల్యేలు వారివారి అసెంబ్లీ ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.అధికార ఎన్ డీ ఏ కూటమి తరఫున ద్రౌపది ముర్మూ.
ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే.
రాష్ట్రపతి ఎన్నికల్లో లోక్‌సభ, రాజ్యసభ, శాసన సభల సభ్యులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది.
పార్లమెంటు, అసెంబ్లీల్లోని నామినేటెడ్ సభ్యులు, శాసనమండలి సభ్యులకు ఓటు హక్కు ఉండదు.ప్రథమ ప్రాధాన్యత సంఖ్య వేయకుండా, ఇతర ప్రాధాన్యత నంబర్లు వేస్తే ఆ ఓటు రద్దవుతుంది.దాంతో మాత్రమే ఓటేయాల్సి ఉంటుంది…

అధికార ఎన్ డీ ఏ కూటమి అభ్యర్థి ద్రౌపది ముర్మూ.ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మధ్య జరుగుతున్న ఈ ఎన్నికలో గెలుపు ఎవరిదన్నది ఇప్పటికే స్పష్టమైంది.ద్రౌపది ముర్మూకు ఎన్డీఏ కూటమిలోని పార్టీలతోపాటు బీజేడీ, బీఎస్ పీ, వైసీపీ, టీడీపీ, ఏఐఏడీఎంకే, శిరోమణి అకాలీదళ్, శివసేనలోని రెండు గ్రూపులూ మద్దతు ప్రకటించాయి.దాంతో,ఎన్ డీ ఏ అభ్యర్థి ద్రౌపది ముర్మూ తదుపరి రాష్ట్రపతిగా ఎన్నిక కావడం ఖాయమని అర్థమవుతోంది.
రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరగనుండగా ఈ నెల 21న ఫలితాలు వెల్లడించనున్నారు.తదుపరి రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీలోని సభ్యులు ఎన్నుకుంటారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ప్రస్తుతం ఈ కాలేజీలో 4 వేల 809 మంది సభ్యులుండగా.వారి ఓటు విలువ 10 లక్షల 86 వేల 431 ఎన్నికైన నూతన రాష్ట్రపతి ప్రమాణస్వీకారం ఈ నెల 25న జరగనున్నది.
దేశ నూతన రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసేది ఎవరన్నది అధికారికంగా వెల్లడయ్యేది ఈ నెల 21న అన్నది గమనార్హం.