బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఆ షోకు దూరమై ప్రస్తుతం మాటీవీలో ప్రసారమవుతున్న ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు.ఈ ఈవెంట్లకు కళ్లు చెదిరే స్థాయిలో రేటింగ్స్ వస్తుండటంతో స్టార్ మా ఛానెల్ నిర్వాహకులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే తాజాగా ఏడుకొండలు సుడిగాలి సుధీర్ పై సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సుడిగాలి సుధీర్ ఇప్పటికే పలు సినిమాలలో హీరోగా నటించగా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.
సుడిగాలి సుధీర్ తనకు విశ్రాంతి లేదని చెప్పి జబర్దస్త్ షోకు దూరమయ్యాడని ఏడుకొండలు అన్నారు.సుడిగాలి సుధీర్ సినిమాలతో బిజీగా ఉన్నానని చెబుతున్నా సుధీర్ నటించిన ఒక్క సినిమా కూడా ఆడలేదని ఏడుకొండలు కామెంట్లు చేశారు.

సుడిగాలి సుధీర్ నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ సినిమాలు సక్సెస్ సాధించలేదని ఏడుకొండలు చెప్పుకొచ్చారు.ఈ సినిమాల వల్ల నిర్మాతలకు ఊహించని స్థాయిలో నష్టం వచ్చిందని ఆయన తెలిపారు.మనం మంచివాళ్లం అయితే మనకు విజయం దక్కుతుందని ఏడుకొండలు వెల్లడించారు.నేను కల్మషం లేకుండా పని చేసుకుంటున్నానని అందువల్లే సంతోషంగా ఉన్నానని ఏడుకొండలు చెప్పుకొచ్చారు.

సుడిగాలి సుధీర్ లాంటి వాళ్లు మోసం చేస్తున్నారని అందుకే వాళ్లకు సక్సెస్ లు దక్కడం లేదని ఏడుకొండలు కామెంట్లు చేశారు.ఏడుకొండలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.ఏడు కొండలు చేసిన కామెంట్ల గురించి సుడిగాలి సుధీర్ స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.సుడిగాలి సుధీర్ సైలెంట్ గా ఉండటం వల్లే ఆయనపై ఇతరులు విమర్శలు చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







