టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా, ఆర్టిస్ట్ గా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో నోయల్ ఒకరనే సంగతి తెలిసిందే.ఈగ, కుమారి 21ఎఫ్ సినిమాలతో నోయల్ పాపులర్ అయ్యారు.
బిగ్ బాస్ షో నోయల్ కు క్రేజ్, పాపులారిటీని మరింత పెంచడం గమనార్హం.హైదరాబాద్ లో జన్మించిన నోయల్ బీఏ చదివారు.ప్రముఖ కంపెనీలలో ఒకటైన కాగ్నిజెంట్ లో నోయల్ ట్రైనీగా పని చేయడం గమనార్హం.
2019 సంవత్సరం నవంబర్ నెలలో ఈస్టర్ నోరోన్హాతో నోయల్ వివాహం జరిగింది.పెళ్లి జరిగిన కొన్ని నెలల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో విడిపోవడం జరిగింది.సంభవామి యుగే యుగే అనే సినిమాతో నోయల్ నటుడిగా పరిచయమయ్యారు.నోయల్ రేడియో జాకీగా కూడా పని చేయడం గమనార్హం.కుమారి 21ఎఫ్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర నోయల్ కు నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టింది.

పలు టీవీ షోలకు నోయల్ యాంకర్ గా పని చేయడం గమనార్హం.నోయల్ తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా రిలీజ్ చేసిన పాటలు సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.తాజాగా రెండో పెళ్లి గురించి నోయల్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.నా రెండో పెళ్లి గురించి చాలామంది అడుగుతున్నారని నోయల్ చెప్పుకొచ్చారు.ఒకసారి బోన్ బ్రేక్ అయితే మళ్లీ అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని నోయల్ తెలిపారు.అదే విధంగా నా రెండో పెళ్లి కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని నోయల్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం నేను సంతోషంగా ఉన్నానని నా లైఫ్ నుంచి వెళ్లిపోయిన వారి గురించి నేను బాధపడనని నోయల్ చెప్పుకొచ్చారు.నోయల్ రెండో పెళ్లి గురించి చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి.







