ఆ పని చేయకుండా బాలయ్యకు రోజు గడవదట.. తండ్రిపై ప్రేమ అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణను అభిమానించే అభిమానులు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లో ఉన్నారు.బాలయ్య నటించిన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ కావాల్సిందేనని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

 Star Hero Balakrishna Showing Affection On His Father Details Here , Balakrishna-TeluguStop.com

తండ్రి సీనియర్ ఎన్టీఆర్ పై బాలయ్యకు అమితమైన ప్రేమ, అభిమానం అనే సంగతి తెలిసిందే.తండ్రి నటించిన సినిమాలను తాను ఎక్కువగా చూస్తానని బాలయ్య పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

బాలయ్య తండ్రి పేరుతో పలు సేవా కార్యక్రమాలను చేస్తూ ఆ కార్యక్రమాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్నారు.పెద్దలను గౌరవించే విషయంలో బాలయ్యకు బాలయ్యే సాటి ఆని చెప్పవచ్చు.

మహిళలకు బాలయ్య ఎంతో గౌరవం ఇస్తారు.బాలయ్య గురించి ఇండస్ట్రీలో ఎన్నో రూమర్లు ప్రచారంలో ఉన్నా బాలయ్యతో పని చేసిన చాలామంది హీరోయిన్లు మాత్రం ఆయన గురించి గొప్పగా చెబుతుండటం గమనార్హం.

అయితే ప్రముఖ నటుడు మురళీ మోహన్ ఒక సందర్భంలో బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.బాలయ్య ఏ ఈవెంట్ లో మాట్లాడినా తమతో మాట్లాడినా కూడా తండ్రి సీనియర్ ఎన్టీఆర్ గురించి కచ్చితంగా మాట్లాడతారని తెలిపారు.

తండ్రిని రోజుకు 100 సార్లు అయినా ఆయన గుర్తు చేసుకుంటారని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు.

Telugu Balakrishna, Murali Mohan, Sr Ntr, Tollywood-Movie

ఇతర ఇండస్ట్రీల నటులకు సైతం సీనియర్ ఎన్టీఆర్ డిసిప్లీన్ గురించి బాలయ్య గొప్పగా చెబుతారని మురళీ మోహన్ కామెంట్లు చేశారు.ప్రతిరోజూ బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ సినిమాలను, పాటలను కచ్చితంగా చూస్తాడని మురళీ మోహన్ వెల్లడించారు.తండ్రిని అమితంగా ప్రేమించే బాలకృష్ణ తండ్రిపై ప్రేమను చాటుకునే ఒక్క సందర్భాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడరనే సంగతి తెలిసిందే.

బాలయ్య ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు.బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube