రామ్ హీరోగా తమిళ దర్శకుడు లింగుసామి డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా ది వారియర్.ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు.దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా సినిమా రిలీజ్ ముందే మ్యూజిక్ తో సినిమాపై ఓ క్రేజ్ ఏర్పడింది.
జూలై 14 అనగా గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
అయితే తమిళ వర్షన్ లో మాత్రం వారియర్ కు చిక్కులు ఏర్పడేలా ఉన్నాయి.
ది వారియర్ సినిమా డైరక్టర్ లింగుసామి వల్లే ది వారియర్ సినిమా రిలీజ్ కి అడ్డంకులు ఏర్పడ్డాయట.లింగుసామి ఇదివరకు తీసిన సినిమాల ఫైనాన్షియల్ ఇష్యూస్ క్లోజ్ అవలేదని.
దాని వల్ల వాటి ఎఫెక్ట్ ది వారియర్ మీద పడుతుందని అంటున్నారు.అందుకే లింగుసామి ఆ ఇష్యూ మీద క్లారిటీ ఇస్తేనే వారియర్ రిలీజ్ క్లియరెన్స్ ఇస్తామని లేదంటే సినిమాని తమిళంలో రిలీజ్ అడ్డుకుంటామని ఫైనాన్షియర్స్ చెబుతున్నారట.

రామ్ సినిమాకు తమిళంలో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ టైం లో ఇలాంటి కష్టాలు ఎదురవడం బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు.అయితే బుధవారం సాయంత్రం కల్లా లింగుసామి ఆ ఫైనాన్షియర్స్ తో చర్చలు జరిపి ది వారియర్ రిలీజ్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చూస్తున్నారట.ఈసారి తమిళ మార్కెట్ పై రామ్ తన సత్తా చాటాలని చూస్తున్నారు.ది వారియర్ ప్రీ రిలీజ్ బజ్ అదిరిపోగా సినిమాతో రామ్ తన మార్క్ చూపించాలని చూస్తున్నారు.
కృతి శెట్టి కూడా ది వారియర్ తో తమిళ పరిశ్రమకు పరిచయం అవుతుంది.అమ్మడికి అక్కడ ఎలా లక్ కలిసి వస్తుందో చూడాలి.







