గ్రూప్ డ్యాన్సర్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ గా మారి ఆ తర్వాత నటుడిగా దర్శకుడిగా సత్తా చాటుతున్న డైరక్టర్ రాఘవ లారెన్స్ సామాజిక సేవలో కూడా ముందుంటారు.ఎందరో అనాథలకు, వికలాంగులకు తన వంతు సాయం చేసి తన మంచి మనసు చాటుకున్న రాఘవ లారెన్స్ ని గుర్తించి డాక్టరేట్ అందించారు.
అంతర్జాతీయ నేర నిరోధక సంస్థ, మానవ హక్కుల సంఘం కలిసి లారెన్స్ కి గౌరవ డాక్టరేట్ ని ప్రకటించారు.రీసెంట్ గా చెన్నైలో ఈ అవార్డ్ కార్యక్రమం జరిగింది.
ఈ డాక్టరేట్ అందుకునేందుకు గాను లారెన్స్ హాజరు కాలేకపోవడంతో ఆయన బదులుగా ఆయన తల్లి కార్యక్రమానికి అటెండ్ అయ్యి డాక్టరేట్ అందుకున్నారు.తల్లి చేతుల మీదుగా డాక్టరేట్ అందుకోవాలని అనుకున్నారో ఏమో లారెన్స్ బదులుగా ఆయన మదర్ ఈ వేడుకలో పాల్గొన్నారు.
లారెన్స్ కి డాక్టరేట్ వచ్చినందుకు ఆయన ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు.ఇక లారెన్స్ సినిమాల విషయానికి వస్తే శివగంగ సినిమా తర్వాత కెరియర్ లో గ్యాప్ ఇచ్చిన లారెన్స్ త్వరలో రెండు భారీ సినిమాలతో రాబోతున్నారు.
అందులో ఒకటి రుద్రుడు కాగా మరొకటి చంద్రముఖి 2.

కాంచన సీరీస్ లతో ప్రేక్షకులను అలరిస్తున్న లారెన్స్ హారర్ కామెడీ జోనర్ లో ఆయన సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు.ఇక రాబోతున్న రుద్రన్ తెలుగులో రుద్రుడు కూడా అదే తరహాలో రాబోతుందని తెలుస్తుంది.ఈ సినిమా తర్వాత పి.వాసు డైరక్షన్ లో చంద్రముఖి 2 వస్తుంది.సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాకు సీక్వల్ గా ఈ మూవీ వస్తుంది.
ఈ మూవీ కూడా భారీ అంచనాలతో వస్తుంది.చంద్రముఖి తర్వాత తెలుగులో విక్టరీ వెంకటేష్ నాగవల్లి అనే సినిమా చేశారు.
అయితే ఆ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో వర్క్ అవుట్ అవలేదు.







