అఖిల్ కొత్త సినిమా ఫిక్స్.. పవర్ స్టార్ టైటిల్ తో రాబోతున్న అక్కినేని హీరో!

యంగ్ హీరో అక్కినేని అఖిల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్నాడు.వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న ఈ హీరోకు బ్యాచిలర్ కాస్త విముక్తి ఇచ్చింది అనే చెప్పాలి.

 Pawan Kalyan's Movie Title For Akhil's Next , Akhil Akkineni, Agent Movie, Suren-TeluguStop.com

ఈ సినిమా హిట్ ఇచ్చిన ఆనందంతో అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు.బ్యాచిలర్ సినిమాలో క్లాస్ గా కనిపించిన అఖిల్ ఈ సినిమాతో ఊర మాస్ లుక్ లో కనిపించ బోతున్నాడు.

ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసిన కానీ గత ఏడాది నుండి కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.దీంతో ముందు అనుకున్న రిలీజ్ డేట్స్ అన్ని కూడా తారుమారు అయ్యాయి.

అందుకే ఈ సినిమా ఆగష్టు 12న రిలీజ్ చేస్తామని చెప్పినా కూడా ఆ సూచనలు అయితే లేవు.ఇక ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తుండగా మలయాళ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా తర్వాత అఖిల్ మరో సినిమా లైన్లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అఖిల్ తర్వాత సినిమ చేయబోతున్నాడు అని రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.ఈ డైరెక్టర్ అఖిల్ లో ఒక రొమాంటిక్ లవ్ డ్రామా సినిమాను ప్లాన్ చేసినట్టు టాక్.

Telugu Akhil Akkineni, Pawankalyans, Sakshi Vaidya, Surender Reddy, Thammudu, Va

ఇక తాజాగా ఈ సినిమాపై మరొక గాసిప్ బయటకు వచ్చింది.ఈ సినిమా ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ చేయక ముందే ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఒక వార్త చక్కర్లు కొడుతోంది.ఈ సినిమాకు వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ ను అనుకుంటున్నాడట.అఖిల్ వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కబోయే సినిమాకు ‘తమ్ముడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నాడట.మరి పవన్ టైటిల్ తో ఈ యంగ్ హీరో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube