రిషి సునాక్ భార్య అంటే ఎంతమందికి తెలుసు? ఇప్పుడు అర్ధం అవుతుంది.అదేనండి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి గురించి వినేవుంటారు.
అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ఆమెపై మండిపోతోంది.విషయం ఏమంటే, తన నివాసానికి వచ్చిన జర్నలిస్టులకు ఖరీదైన కప్పుల్లో అక్షతా మూర్తి టీ తేవడమే ఈ విమర్శలకు దారి తీసింది.
అంతవరకూ బాగానే వుంది.మరి ఇందులో తప్పేమిటి అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. బ్రిటన్ ప్రధాని రేసులో తానూ ఉన్నానంటూ రిషి సునాక్ ప్రకటించడంతో జర్నలిస్టులు ఆయన ఇంటర్వ్యూ కోసం వచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.అదన్నమాట అసలు విషయం.
అక్షతా మూర్తి తమకు టీ తీసుకొస్తున్న చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విలేకరులు.ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.
అయితే.మన నెటిజన్లు ఊరుకోరు కదా? అన్ని పరిశీలిస్తారు.ఇక వారి దృష్టి మాత్రం ఆ కప్పులపై పడింది.ధరల పెరుగుదలతో అల్లాడుతున్న బ్రిటన్ ప్రజలు.ఈ ఖరీదైన కప్పులు చూసి విస్తుపోయారు.ఒక్క కప్పు ధరతో ఓ కుటుంబానికి 2 రోజుల పాటు భోజనం పెట్టొచ్చని కొందరు తమ అక్కసుని వెళ్లగక్కారు.ఈ కప్పుల ఖరీదు 39 పౌండ్లు, అంటే మన కరెన్సీలో దాదాపు రూ.3700! ఇక ఈ విషయమై అక్షిత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి!

ఇకపోతే, బ్రిటన్‌లో ట్యాక్స్ చెల్లించని కారణంగా గతంలో ఓసారి అక్షతా మూర్తిపై విమర్శలు వచ్చిన మాట మీరు వినేవుంటారు.అయితే.తనకు స్థానికత హోదా లేని కారణంగానే ట్యాక్సులు చెల్లించలేదని అక్షతా మూర్తి అప్పట్లో వివరణ ఇచ్చి తప్పించుకున్నారు.
అలాగే భవిష్యత్తుల్లో స్థానికత హోదా తీసుకుని పన్నులు చెల్లిస్తానని కూడా హామీ ఇవ్వడంతో ఆ తంతు ముగిసింది.మరోవైపు.బోరిస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రిషి సునాక్‌పైనా కూడా అప్పట్లో పన్నుల విషయమై విమర్శలు చెలరేగాయి.ఇక తాజాగా అక్షతా మూర్తి ఖరీదైన టీ కప్పులు వినియోగించడం బ్రిటన్‌లో చర్చకు తెరలేపింది.







