గూగుల్ తమ యూజర్లను దృష్టిలో పెట్టుకొని అద్భుతమైన ఫీచర్లను ప్రవేశ పెట్టింది.అందులో వాయిస్ అసిస్టెంట్ టెక్నాలజీ అయినటువంటి గూగుల్ అసిస్టెంట్ ఒకటి.
ఈ గూగుల్ అసిస్టెంట్ అనేది అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఓ అరుదైన టెక్నాలజీ అని చెప్పుకోవాలి.ఇది యూజర్లకు అనేక రకాలగా ఉపయోగపడుతుంది.
వార్తలను డిస్‌ప్లే చేయడం దగ్గరి నుంచి కిరాణా సామాగ్రి కొనుగోలు చేయమని గుర్తు చేయడం వరకు.ఇలా అన్ని రకాల అలర్ట్స్ ఇది సెటప్ చేయగలదు.
యూజర్లు ‘హే, గూగుల్’ అని చెప్పడమే ఆలస్యం.విభిన్న రకాల సేవలను అందించడానికి సిద్ధంగా ఉంటుంది.
అయితే సాధారణ యూజర్లకు తెలియని అనేక అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఈ టెక్నాలజీలో కలవు.వీటి గురించి తెలియకపోతే, దీని సేవలను పూర్తిగా వినియోగించుకోలేమని అర్ధం చేసుకోవాలి.కాబట్టి ఇపుడు వీటి ఫీచర్ల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
1.ప్రతిరోజూ మీరు వార్తలు తెలుసుకోవడానికి గూగుల్ అసిస్టెంట్ సహాయం తీసుకోవచ్చు.తాజా వార్తలు ఏంటి? అని అడిగితే చాలు, వర్చువల్ అసిస్టెంట్ మీకు ప్రపంచంలోని తాజా ఈవెంట్‌ల సమరీని ఆటోమెటిక్‌గా అందించడం మొదలుపెడుతుంది.
2.అలాగే మీరు తెలియని ఏరియాకు వెళ్లాలంటే వర్చువల్ అసిస్టెంట్ మీ డెస్టినేషన్‌కు బెస్ట్ రూట్స్‌ను కనుగొంటుంది.ఇందుకు GPS ఫంక్షన్ సహాయం తీసుకుంటుంది.

3.అలారాలను సెట్ చేసే ఫంక్షనాలిటీ కూడా గూగుల్ అసిస్టెంట్‌లో కలదు.ఇది మీ డైలీ రొటీన్‌ను మరింత ఈజీగా మ్యానేజ్ చేస్తుంది.
ఉదాహరణకు, మీరు ‘స్లీప్‌టైమ్’ అని చెప్పి.మీ స్లీపింగ్ టైమ్‌ను యాక్టివేట్ చేయవచ్చు.
4.అంతేకాకుండా మంచి నిద్ర కోసం రిలాక్సింగ్ సౌండ్స్ ప్లే చేస్తుంది కూడా.తర్వాతి రోజు బ్యాటరీని రీఛార్జ్ చేయాలంటే, ఆ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తుంది.‘Set alarm’ అని చెప్పడం ద్వారా కూడా సులభంగా అలారం సెట్ చేసుకోవచ్చు.
5.ఇక గూగుల్ అసిస్టెంట్ అందించే అత్యంత ఉపయోగకరమైన టూల్స్‌లో ఒకటి రిమైండర్స్ మేనేజ్ చేయడం.యూజర్లు ఒక నిర్దిష్ట సమయం, రోజులో చేయాల్సిన పనుల కోసం రిమైండర్ సెట్ చేసుకోవచ్చు.కాబట్టి ఇక్కడ పేర్కొన్న ఉపయోగాలన్నీ మీరు దానిద్వారా పొందవచ్చు.