స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ ఏ సినిమాలో నటించినా ఏ పాత్రలో నటించినా తన నటనతో ఆ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళతారనే సంగతి తెలిసిందే.అఖండ సినిమాలో బాలయ్య నటన సూపర్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపించాయి.
బాలయ్య కాకుండా మరెవరు ఆ సినిమాలో నటించినా ఈ స్థాయిలో హిట్టయ్యేది కాదని బాలయ్య స్థాయిలో నటించే నటీనటులు ఇండస్ట్రీలో చాలా తక్కువమంది ఉన్నారని చాలామంది భావిస్తారు.
మాస్ ప్రేక్షకుల్లో బాలయ్యను అభిమానించే అభిమానులు ఎక్కువసంఖ్యలో ఉన్నారు.
బాలయ్య నటించిన అఖండ సినిమా తక్కువ టికెట్ రేట్లతో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఫుల్ రన్ లో ఈ సినిమా దాదాపుగా 80 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.
నిర్మాత ఈ సినిమా కోసం 70 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా థియేట్రికల్ హక్కుల ద్వారానే ఈ మొత్తం రికవరీ అయ్యాయి.
తాజాగా సోషల్ మీడియాలో ఒక వైరల్ కాగా ఆ వీడియోలో బుడ్డోడు దేవుడి పటాల ముందు కూర్చుని పూజలు చేస్తున్నాయి.తల్లి జై సాయిరాం అనాలని బుడ్డోడికి సూచించగా బుడ్డోడు మాత్రం జై బాలయ్య అంటూ అందరినీ ఆశ్చర్యపరిచారు.యూఎస్ కు చెందిన ఈ బుడ్డోడు బాలయ్యకు వీరాభిమాని కావడంతో ఈ విధంగా కామెంట్ చేశాడని తెలుస్తోంది.
ఈతరం పిల్లలపై కూడా బాలయ్య ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
మరోవైపు బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారనే సంగతి తెలిసిందే.బాలయ్యకు జోడీగా శృతి నటిస్తుండగా ఈ సినిమా అఖండ సినిమాను మించిన బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది.బాలయ్య సినిమాలకు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.