రాష్ట్రపతి ఎన్నిక వేళ చంద్రబాబు మౌనం దేనికి సంకేతం?

దేశంలో రాష్ట్రపతి ఎన్నిక హాట్‌ టాపిక్‌గా మారింది.అన్ని పార్టీలు తాము ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలనే విషయాలపై మంతనాలు జరుపుతున్నాయి.

 Chandrababu's Silence During The Presidential Election Is A Sign Of What Andhra-TeluguStop.com

ఎన్డీయే కూటమి నుండి ద్రౌపది ముర్ము బరిలో దిగనుండగా.ప్రత్యర్థి కూటమి నుంచి యశ్వంత్ సిన్హా పోటీపడుతున్నారు.

ఇప్పటికే వీరిద్దరూ నామినేషన్‌లు కూడా దాఖలు చేశారు.దేశంలోని కీలక పార్టీలన్నీ రెండుగా చీలిపోయి ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు లేదంటే ప్రత్యర్థి కూటమి నుండి పోటీలో ఉన్న యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తున్నాయి.

అయితే ఏపీలోని టీడీపీ మాత్రం భిన్నంగా ఆలోచిస్తోంది.

నిజానికి ప్రెసిడెంట్ ఎలక్ట్రోల్ కాలేజీలో టీడీపీకి ఉన్న ఓట్ల శాతం 0.60 శాతం మాత్రమే.ఇది స్వల్ప నంబరే అయినా జాతీయ రాజకీయాలను శాసించిన టీడీపీ స్టాండ్ తీసుకోవడం రాష్ట్రపతి అభ్యర్థులకు ముఖ్యమే.

ఇప్పటివరకు అయితే రాష్ట్రపతి ఎన్నికల వేళ టీడీపీ ఎలాంటి ప్రకటన చేయలేదు.పలానా అభ్యర్థిని సమర్థిస్తున్నట్లు ప్రకటించకపోవడంతో రాజకీయం చంద్రబాబు మరోసారి తన మార్క్ రాజకీయం చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది.

రాష్ట్రపతి ఎన్నికలను ఏపీలో జగన్ సర్కారుకు, ఢిల్లీలోని మోదీ సర్కారుకు తన చాణిక్యాన్ని చూపించాలని చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది.ఇటీవల రాష్ట్ర రాజకీయాలను పరిగణనలోకి తీసుకుంటే చంద్రబాబు బీజేపీకి మద్దతిస్తారని అందరూ భావించారు.

ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీలను కలుపుకుని పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది.కానీ అనూహ్యంగా చంద్రబాబు రాష్ట్రపతి ఎన్నిక విషయంలో సైలెంట్‌గా ఉన్నారు.ఇటీవల మోదీ మాత్రం చంద్రబాబును పట్టించుకోవడం లేదని, అదే సమయంలో ఢిల్లీకి వెళితే కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వట్లేదనేది టాక్.దాంతో చంద్రబాబుకు కోపం వచ్చిందని, అదును చూసి తన రాజకీయ నీతిని చూపించాలని వేచి చూస్తున్నారట.

Telugu Andhra Pradesh, Chandrababu, Draupadi Murmu, Janasena, Modi, Pawan Kalyan

అందులో భాగంగా రాష్ట్రపతి ఎన్నికల్లో మోదీ సర్కా్ర్ బలపరుస్తున్న ద్రౌపది ముర్ముకు కానీ, ప్రతిపక్షాల అభ్యర్థి అయిన యశ్వంత్ సిన్హాకు చంద్రబాబు మద్దతు ఇవ్వలేదన్న చర్చ నడుస్తోంది.దీంతో అటు ఎన్డీయేకు ఇటు విపక్ష శిబిరానికి టీడీపీ సమ దూరం పాటిస్తోంది.మరో రెండేళ్ళలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తరువాత కేంద్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం విషయంలో అన్ని ఆప్షన్‌లు తమ వద్దనే ఉంచుకునేందుకు టీడీపీ న్యూట్రల్ స్టాండ్ ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.అయితే తాను ఏం చేసినా ఏపీలో జగన్ సర్కారుకు చెక్ పెట్టేలా ఉండాలని అదే సమయంలో ఢిల్లీలోని మోదీ, అమిత్ షా ద్వయానికి తన సత్తా తెలిసేలా పావులు కదపడానికి చంద్రబాబు చూస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube