మనిషి స్వార్థం, అభివృద్ధి పేరిట చెట్లు విపరీతంగా కొట్టివేయడం, కర్బన ఉద్గారాలు, కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.భూమి వేడెక్కడంతో పాటు గతి తప్పిన రుతుపవనాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు మనిషి.
రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి.చెట్లు నాటాలని ఎంతోమంది పిలుపునిస్తున్నారు.
కానీ ఆచరించి చూపేవారి సంఖ్య అతి స్వల్పమే.ఈ నేపథ్యంలో ఓ సిక్కు సంస్థ మాత్రం.
వాతావరణ మార్పులపై సీరియస్‌గా దృష్టి సారించింది.భవిష్యత్ తరాల కోసం చెట్లు నాటాలని సంకల్పించింది.
అమెరికా రాజధాని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న ఎకోసిఖ్ సంస్థ 2027లో అమృత్‌సర్ 450వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే ఐదేళ్లలో 450 అడవులను నాటనుంది.జూన్ 27న ‘ఎకో అమృత్‌సర్ 450’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌జీపీసీ, పౌర సమాజం, విద్యా సంస్థలు, ప్రవాసులు, మత, ప్రభుత్వ సంస్థలు పాల్గొంటాయి.

1577లో అమృత్‌సర్ నగర నిర్మాణానికి గురు రాందాస్ శంకుస్థాపన చేశారు.ఈ వందల ఏళ్లలో నగరం ఎంతో అభివృద్ధి చెందింది.అయితే గాలి నాణ్యత కూడా క్షీణించింది.
అందుకే అమృత్‌సర్‌లో 450 పవిత్ర మొక్కలను నాటాలని ఎకో సిఖ్ సంస్థ నిర్ణయించింది.ఇప్పటికే గురునానక్ 550వ జయంతిని పురస్కరించుకుని 1 మిలియన్ చెట్లను నాటాలనే లక్ష్యంలో భాగంగా గత 38 నెలల్లో 400 అడవులను నాటినట్లు ఎకో సిఖ్ ఫారెస్ట్ కన్వీనర్ చరణ్ సింగ్ తెలిపారు.
భారత్‌లోని పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, జమ్మూ సహా అనేక రాష్ట్రాల్లో ఎకోసిఖ్ అడవులను నాటినట్లు నిర్వాహకులు చెప్పారు.ఒక్కో అడవిలో 550 రకాల స్థానిక జాతుల చెట్లు వుంటాయన్నారు.
జపనీస్ మియావాకీ పద్ధతిని అనుసరించి ఈ చెట్లను నాటామని.పంజాబ్ సహా భారత్ అంతటా వీటిని గూగుల్ మ్యాప్ సాయంతో ట్యాగ్ చేశామని పేర్కొన్నారు.







