టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల్లో రామ్ చరణ్ శైలి చాలా విభిన్నమైనది.ఆయన యొక్క బ్లాక్ బస్టర్ సినిమాలు ఆ వెంటనే అట్టర్ ప్లాప్ లు ఒక సెంటిమెంట్ గా మారిపోయాయి.
ఒక హిట్ సినిమా పడితే వెంటనే ప్లాప్ పడుతుంది.అది ఆయనకు ఒక సెంటిమెంట్ గా మారుతూ వచ్చింది.
కెరీర్ ఆరంభంలో మగధీర సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే.ఆ వెంటనే వచ్చిన ఆరంజ్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
చరణ్ కెరీర్ ఉన్నంత కాలం ఆరంజ్ సినిమా అట్టర్ ప్లాప్ విషయం చర్చ కు వస్తూనే ఉంటుంది.ఇక రామ్ చరణ్ తదుపరి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ రంగస్థలం.
సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన రంగస్థలం అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.నాన్ బాహుబలి రికార్డు ను నమోదు చేసి సరికొత్త రామ్ చరణ్ ను చూపించడం జరిగింది.
రంగస్థలం తర్వాత రామ్ చరణ్ నుండి వచ్చిన చిత్రం వినయ విధేయ రామ.ఈ సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది.
డిజాస్టర్ గా నిలిచింది. బోయపాటి దర్శకత్వం లో వచ్చిన ఆ సినిమా మెగా ఫ్యాన్స్ షాక్ అయ్యేలా చేసింది.ఇక జక్కన్న దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఏ స్తాయి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే.ఆ సినిమా తర్వాత వచ్చిన ఆచార్య సినిమా డిజాస్టర్ గా నిలిచింది.
మరీ ఇలాంటి డిజాస్టర్ సినిమా ను చరణ్ చేసి ఉండకూడదు అంటూ అంతా విమర్శలు చేశారు.ఆచార్య ప్లాప్ తర్వాత చరణ్ చేస్తున్న సినిమా ఆర్ సీ 15.
శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న ఆర్ సీ 15 సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అంటూ మెగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఈ హిట్ ప్లాప్.
హిట్ ప్లాప్ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఆర్ సీ 15 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున విడుదల అవ్వబోతుంది.







