సెన్సార్ బోర్డ్ వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టాలి.. సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్?

ఒక సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని థియేటర్లో విడుదల కావాలి అంటే తప్పనిసరిగా ఆ సినిమాకి సెన్సార్ బోర్డు వారి అనుమతి తప్పనిసరిగా ఉండాలి.సినిమా విడుదలకు ముందు తప్పనిసరిగా ఆ సినిమాని సెన్సార్ సభ్యులు వీక్షించి అందులో ఏ విధమైనటువంటి అసభ్య పదజాలం ఉన్నా లేదా అశ్లీలత సన్నివేశాలు ఉన్న వెంటనే వాటిని తొలగించి సినిమా విడుదలకు అనుమతి ఇస్తారు.

 Censor Board Should Focus On Web Series Senior Actor Shocking Comments Web Serie-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రతి ఒక్క సినిమా కూడా సెన్సార్ అనుమతి తీసుకొని థియేటర్లలో విడుదల అవుతుంది.అయితే ఇదే సినిమా ఓటీటీలలో విడుదల అయితే సెన్సార్ బోర్డు కట్ చేసిన సన్నివేశాలతో సహా విడుదల చేస్తారు.

థియేటర్లో మనం మిస్ అయిన కొన్ని సన్నివేశాలను కూడా ఓటీటీలో చూడవచ్చు.అయితే తాజాగా ప్రముఖ నటుడు సుమన్ మీడియా సమావేశంలో భాగంగా ఓటీటీలు, వెబ్ సిరీస్ ల గురించి పలు షాకింగ్ కామెంట్ చేశారు.

కరోనా పరిస్థితుల కారణంగా థియేటర్లు మూత పడటంతో ఓటీటీల హవా పెరిగిపోయింది.చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇందులో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్ చూడటానికి అలవాటు పడ్డారు.

ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ లపై సెన్సార్ అభ్యంతరం లేకుండా ప్రసారం కావడం వల్ల కొన్ని అశ్లీల సన్నివేశాలు చిన్న పిల్లలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నటుడు సుమన్ పేర్కొన్నారు.

Telugu Otts, Senior, Suman, Theaters, Ticket Rates, Tollywood, Web-Movie

ఈ క్రమంలోనే ప్రభుత్వం కాస్త చొరవ చూపి ఓటీటీలు, వెబ్ సిరీస్ లపై కూడా సెన్సార్ సభ్యులు దృష్టి పెట్టాలని ఈయన వెల్లడించారు.ఈ విధంగా చేయటం వల్ల చిన్నపిల్లలు కొన్ని ప్రభావాలకు గురి కాకుండా ఉంటారని ఆయన పేర్కొన్నారు.ఈ మీడియా సమావేశంలో భాగంగా సుమంత్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే సినిమా టికెట్ల గురించి మాట్లాడటం కోసం ఆయన ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం మూడు సార్లు ప్రయత్నించిన తనకు అపాయింట్మెంట్ దొరక లేదని తెలిపారు.సినిమా టికెట్ల రేట్లను పక్కన ఉంచితే సినిమాని కోట్లలో కొన్ని నష్టపోతున్న బయ్యర్ల గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలని సుమన్ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube