స్టార్ హీరోయిన్ సాయిపల్లవి ఇతర హీరోయిన్లకు భిన్నంగా వ్యవహరిస్తూ మనస్సుకు నచ్చిన పాత్రలకు మాత్రమే ఓటేస్తున్న సంగతి తెలిసిందే.కథ నచ్చకపోయినా, పాత్ర నచ్చకపోయినా, రీమేక్ సినిమాలైనా సాయిపల్లవి నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తుండటం గమనార్హం.
యువతలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరు.
సాయిపల్లవి డ్రెస్సింగ్ సెన్స్ కు, డ్యాన్స్ కు లేడీస్ లో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారనే ప్రశ్నకు సాయిపల్లవి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అబ్బాయిలు ఇలానే ఉండాలనే నిబంధన నాకు లేదని అయితే సెన్సిటివ్ గా ఉండే అబ్బాయిలను తాను ఇష్టపడతానని ఆమె చెప్పుకొచ్చారు.
సెన్సిటివ్ గా ఉండే అబ్బాయిలు మనస్పూర్తిగా ఏదైనా ఫీలై చెబితే నాకు ఇష్టమని ఆమె వెల్లడించారు.
అబ్బాయిలు ఏదైనా విషయం గురించి వెంటనే స్పందించి ఏడిస్తే తనకు నచ్చుతారని ఆమె వెల్లడించారు.
అబ్బాయిలు మ్యాచోగా ఉంటే నచ్చదని అమ్మాయిలను హర్ట్ చేయకూడదని భావించి అబ్బాయిలు చేసే త్యాగాలు అయినా ప్రయత్నాలు అయినా తనకు నచ్చుతాయని ఆమె తెలిపారు.అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలనే ఆలోచనతో కండలు పెంచే అబ్బాయిలు తనకు అస్సలు నచ్చరని ఆమె చెప్పుకొచ్చారు.

అబ్బాయిలు ఫిట్ గా ఉంటే సరిపోతుందని భారీగా శరీరాన్ని పెంచాల్సిన అవసరం లేదని ఆమె కామెంట్లు చేశారు.లవ్ ను ప్రపోజ్ చేసిన సమయంలో మనస్సుకు నచ్చితే చాలని బంగారంతో చేసిన ఉంగరాలు, రోజా పూలు ఇచ్చి ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదని అమె తెలిపారు.సాయిపల్లవి చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.సాయిపల్లవి చేసిన వివాదాస్పద కామెంట్ల గురించి కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేయగా సాయిపల్లవి ఇప్పటికే ఆ వ్యాఖ్యల గురించి వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.







