అమెజాన్ ప్రైమ్ లో 'సర్కారు వారి పాట' స్ట్రీమింగ్.. ఎప్పటి నుండి అంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

 Sarkaru Vaari Paata Ott Release Date Confirmed, Mahesh Babu, Sarkaru Vaari Paata-TeluguStop.com

మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ సినిమా అన్ని అడ్డంకులను దాటుకుని మే 12న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.మహేష్ బాబు వరుస హ్యాట్రిక్ సినిమాల తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై ముందు నుండి అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

ఇలా ఎన్నో అంచనాల మధ్య మహేష్ బాబు సర్కారు వారి పాట థియేటర్ ల లోకి వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది.టాక్ ఎలా ఉన్న కూడా పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ లో దూసుకు పోయిందనే చెప్పాలి.

ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు అవుతుంది.దీంతో ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లోకి రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతుంది.అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులు సొంతం చేసుకుంది.ఈ క్రమంలోనే ఈ రోజు అమెజాన్ ప్రైమ్ అఫిషియల్ గా సర్కారు వారి పాట సినిమా స్ట్రీమింగ్ డేట్ గురించి ప్రకటించింది.

జూన్ 23 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది అని చెప్పడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమాను మరోసారి వీక్షించేందుకు సిద్ధం అయ్యారు.

Telugu Mahesh Babu, Ott, Pooja Hegde, Rajamouli, Sarkaruvaari, Trivikram-Movie

ఇక మహేష్ బాబు ఈ సినిమా విజయం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ప్రెసెంట్ మహేష్ అమెరికాకు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్ళాడు.వెకేషన్ నుండి రాగానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.

ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నారు.

హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా తర్వాత మహేష్ బాబు అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube