పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాక మునపటి కంటే ఫాస్ట్ గా సినిమాలను పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈయన మధ్య మధ్యలో కొంత కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాడు.
ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
తన ఆటిట్యూడ్, మ్యానరిజంతో ఈ సినిమాను సూపర్ హిట్ గా నిలబెట్టాడు పవన్.
పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమాలు కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉండడంతో ఈయన సినిమాలకు బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది.
ప్రెసెంట్ పవన్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి.ఇవన్నీ కూడా వచ్చే దసరా లోపు పూర్తి చేయాలనీ అదే పనిలో పవర్ స్టార్ ఉన్నారని టాక్ వినిపిస్తుంది.
వచ్చే దసరా లోపు సినిమాలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేయబోతున్నారని చెప్పుకుంటున్నారు.
ఇక ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ లైనప్ లో హరిహర వీరమల్లు ఉంది.అలాగే ఆ తర్వాత మరొక రెండు సినిమాలు లైన్లో ఉన్నట్టు తెలుస్తుంది.‘హరిహర వీరమల్లు’ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.ప్రెసెంట్ అయితే ఈ షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.ఇక ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఆర్డర్ లో ఒక రీమేక్ సినిమా కూడా ఉంది.

తమిళంలో మంచి విజయం సాధించిన ‘వినోదయ సీతమ్’ అనే సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు.సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఇక ఇక్కడ తెలుగులో కూడా సముద్రఖని దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కనుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు పవన్ 20 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారట.

స్క్రిప్ట్ వర్క్ చివరికి చేరుకోవడం, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతుండడంతో ఈ సినిమా త్వరలోనే అధికారికంగా ప్రకటించడమే కాకుండా వెంటనే సెట్స్ మీదకు తీసుకు వెళ్లనున్నారని సమాచారం.పవన్ ఈ సినిమాను 18 నుండి 20 రోజుల్లోనే తన పార్ట్ పూర్తి చేయాలనీ కండిషన్ పెట్టారట.అందుకే ముందుగా అతడికి సంబంధించిన షూట్ కంప్లీట్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఇందులో పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.







