మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా చెన్నూరులో 587 ఇళ్ల పట్టాల పంపిణీ

తెలంగాణ ఏర్పాటు తర్వాతే సీఎం కేసీఆర్ గారి సారథ్యంలో అభివ్రుద్ది ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా, లక్ష రూపాయలు కట్టిన ఇల్లివ్వని గత ప్రభుత్వాలు రూపాయి ఖర్చు లేకుండా సగర్వంగా జీవించేలా ఇళ్లు అందజేస్తున్న ప్రభుత్వం బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కళ్యాణలక్ష్మీ లాంటి పథకం ఎందుకు లేదు మనుసున్న మారాజు కేసీఆర్ కాబట్టే సంక్షేమ పాలన పుట్టిన దగ్గరినుండి వ్రుద్దాప్యంలో ఆసరా వరకూ ప్రభుత్వ పథకాలు సీఎం కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు దీవెనార్థులు ఇవ్వాలి రామక్రుష్ణాపురం పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ సింగరేణి ఏరియాలోనే 5800 ఇళ్ల పట్టాలు కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే అభివ్రద్ది, సంక్షేమ పాలన ప్రభుత్వానికి అండగా ఉండాలి – బాల్క సుమన్ మంత్రి గంగులను, ఎంపీ వద్దిరాజు రవిచంద్రను ఘనంగా సన్మానించిన మున్నూరు కాపు సంఘం.

 Distribution Of 587 House Deeds In Chennur By Minister Ganguly Kamalakar , Minis-TeluguStop.com

తెలంగాణ వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రజల జీవితాల్లో సమూల మార్పుల సంబవించాయని, గూడు లేని నిరుపేదలకు గౌరవ ప్రదమైన ఇండ్లను కట్టించి ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదన్నారు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.

శుక్రవారం ప్రభుత్వ విఫ్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి మంచిర్యాల జిల్లా లోని చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని రామకృష్ణ పూర్ పట్టణం లో సింగరేణి ఇళ్ల పట్టాల పంపిణి లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా లబ్దీదారులతో మాట్లాడి వారి సంతోషాన్ని పంచుకున్నారు, గతంలో చుట్టాలింటికి చూద్దామని సింగరేణి ఏరియాలైన లక్షెట్టిపేట, మంచిర్యాల, రామక్రుష్ణాపూర్ వంటి ప్రాంతాలకు వస్తే ఇక్కడితో పాటు యావత్ తెలంగాణ వ్యాప్తంగా గతంలో ప్రజలు ఇల్లులేక, గూడులేక, నీడలేక, పోలీసుల వేదింపులు ఒకవైపు, లక్ష రూపాయలు కడుతాం అన్నా పట్టా ఇవ్వని ప్రభుత్వం ఒకవైపు ఎన్నో అగచాట్లు పడ్డారన్నారు, వాటన్నింటిని రూపుమాపాలని తెలంగాణ ఆడపడచుల మొఖాల్లో సంతోషం వెల్లివిరియాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రామక్రుష్ణాపురంలోనే మూడువేల పట్టాల్ని అందిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు, తల్లి నవ్వుతే, ఊరు నవ్వుతది, ఊరు నవ్వితే జిల్లా నవ్వుతది, జిల్లా నవ్వుతే తెలంగాణ నవ్వుతది, తెలంగాణ నవ్వడమే కేసీఆర్ కు కావాల్సింది అన్నారు మంత్రి గంగుల.

ఎక్కడైతే యాతన పడ్డామో అక్కడ ఆ పోలీస్ స్టేషన్ల ముందే సంతోషంగా బతుకమ్మలను ఆడిస్తున్నామన్నారు.స్థానిక ఎమ్మెల్యే ఉద్యమకారుడు సుమన్ పోరాటంతోనే 76 జివో వచ్చి ఆడబిడ్డలకు గూడు దొరికిందన్న మంత్రి గంగుల చురుకైన నాయకుడు బాల్క సుమన్ సారథ్యంలో వందల కోట్ల నిధులు చెన్నూరుకు వస్తున్నాయన్నారు.

మొదటి విడత ఇండ్ల పంపిణీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా అయితే, రెండవ విడత అందించే అద్రుష్టం తనకు దక్కిందన్నారు అలాగే మూడవ విడుత కేటీఆర్ గారు, నాలుగో విడత కేసీఆర్ గారే ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు.

తెలంగాణలో పుట్టిన ఆడబిడ్డలు తెలంగాణ ఆస్థిగా భావించి సహాయం చేస్తున్న గొప్ప మనసున్న మనిషి కేసీఆర్ గారన్నారు.

తెలంగాణకు ముందు ఎన్నో ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మారినా… నేడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉన్నా ఎక్కడా, ఎవరూ బిడ్డ పెళ్లికి లక్షనూటపదహార్లు ఇవ్వలేదని, కేవలం తెలంగాణలో మాత్రమే కేసీఆర్ గారు ఇస్తున్నారన్నారు, అంతేకాదు వేల రూపాయల విలువ చేసే కాన్పుకు ప్రభుత్వ ఆసుపత్రులను సిద్దంచేసి కేసీఆర్ కిట్టును అందించి చదువుకోవడానికి బ్రహ్మండమైన గురుకులాల్ని ఏర్పాటుచేసి పుట్టినప్పటి నుండి చివరి దశలో ఆసరాగా నిలబడుతున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివ్రుద్దిలో దూసుకుపోతుందన్నారు, రామక్రుష్ణాపూర్ పరిధిలో తొలి విడతలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా 1032 ఇళ్ల పట్టాలు అందజేసామని, నేడు మంత్రి గంగుల చేతుల మీదుగా రెండవ విడుతలో 587 ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో 679 మంది డీడీలు కట్టగానే ఇస్తామని, 124 రిజిస్ట్రేషన్ దశలో ఉన్నాయని మరో 382 అతి త్వరలోనే లబ్దీదారుల్ని గుర్తించి ఇస్తామన్నారు, మరో పదిరోజుల్లో 1260 మందికి ఇస్తామన్నారు.

ఇలా మొత్తం 3000 మందికి ఇస్తున్నామని, జీవో 76 ఎక్స్ టెన్షన్ వల్ల మరో 2000 మందికి సింగరేణి భూములు ఇచ్చిన తర్వాత 800 ఇల్లు వస్తాయన్నారు, ఇలా 5800 ఇల్లను అందిస్తున్నగౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రతీ ఒక్కరం గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలన్నారు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే క్యాతంపల్లి మున్సిపాలిటీగా ఏర్పడిందని, చెన్నూరు నియోజకవర్గానికి వందల కోట్ల నిధుల్ని కేటాయిస్తూ అభివ్రుద్ది చేస్తున్నామన్నారు.

అంతకుముందు మంత్రి గంగుల కమలాకర్ని స్థానిక డోలు వాయిద్యాలతో సాంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు, వివిద సంఘాలకు చెందిన నేతలు ప్రజలు మంత్రిని ఘనంగా సన్మానించారు, ఇళ్ల పట్టాలు పొందిన అవ్వలు మంత్రిని సంతోషంగా సన్మానిస్తుంటే అక్కడి ప్రజల గుండెలు బావోద్వేగంతో నిండిపోయాయి.

అనంతరం రామక్రుష్ణాపురంలో మున్నూరు కాపు సంఘాల నేతలు మంత్రి గంగులతో పాటు రాజ్యసభకు ఎన్నికైన వద్దిరాజు రవిచంద్రను ఘనంగా సన్నానించారు.ఈ కార్యక్రమాల్లో మంత్రి గంగులతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మాజీ మంత్రి అధిలాబాద్ శాసనసభ్యులు జోగురామన్న, అసిపాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం, టీఆర్ఎస్ శ్రేణులు, లబ్దీదారుల కుటుంబాలు, వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube