జూన్ 24న అవికా గోర్, శ్రీరామ్‌ల‌ 'టెన్త్ క్లాస్ డైరీస్' విడుదల

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్పతాకాలపై రూపొందిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’.అచ్యుత రామారావు .

 Avika Gor Sriram Tenth Class Diaries Movie Releasing On June 24 Details, Avika G-TeluguStop.com

పి, రవితేజ మన్యంసంయుక్తంగా నిర్మించారు.అజయ్ మైసూర్ సమర్పకులు.

ఈ చిత్రంతో ప్రముఖఛాయాగ్రాహకులు ‘గరుడవేగ’ అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు.జూన్ 24నసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘రోజ్ విల్లా’, ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రాల తర్వాత అచ్యుత రామారావు నిర్మించినచిత్రమిది.ఇందులో శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన (వేద), హిమజ, శివబాలాజీ, మధుమిత, ‘సత్యం’ రాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయిరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులకు చేరువయ్యాయి.సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన అవికా గోర్పరిచయ గీతం ‘ఎగిరే ఎగిరే…’తో పాటు ‘పియా పియా…’, ‘కుర్రవాడా కుర్రవాడా…’ పాటలకు, ప్రత్యేక గీతం ‘సిలకా సిలకా’కు మంచి స్పందన లభించింది.

నిర్మాతల్లో ఒకరైన అచ్యుత రామారావు మాట్లాడుతూ “డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలుచేసినా… వాళ్ళందరి జీవితాల్లో టెన్త్ క్లాస్ మెమరీ అనేది మైల్ స్టోన్ లాంటిది.ఆ మెమ‌రీస్మిగ‌తా జీవితం మీద డైరెక్ట్‌గా, ఇన్ డైరెక్ట్‌గా ప్ర‌భావం చూపిస్తాయి.

ఒక రకంగా లైఫ్పార్ట్‌న‌ర్ లాంటిది.ఆ మెమరీస్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది.

కొంత మంది జీవితాల్లోజరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ‘టెన్త్ క్లాస్ డైరీస్’ను రూపొందించాం.

Telugu Srinivasa Reddy, Avika Gor, Sri Ram, June, Tenth Class-Movie

పదోతరగతి చదివిన ప్రతి ఒక్కరినీ ఆ రోజులలోకి తీసుకు వెళుతుంది.దర్శకుడు ‘గరుడవేగ’ అంజి వాణిజ్య హంగులతో వినోదాత్మకంగా తెరకెక్కించారు.ఇప్పటి వరకూ విడుదల చేసినపాటలు, టీజర్, ట్రైలర్‌కు రెస్పాన్స్ బావుంది.

సినిమా అన్ని వర్గాలప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.టెన్త్ క్లాస్ నేపథ్యంలో సన్నివేశాలు ప్రతి ఒక్కరికీ కనెక్ట్అవుతాయి.‘రోజ్ విల్లా’, ‘ముగ్గురు మొనగాళ్లు’ తర్వాత ఈ సినిమాతో నిర్మాతగా మరో హిట్అందుకుంటాననే నమ్మకం ఉంది.ఈ చిత్రాన్ని నైజాం లో ఏషియన్ సునీల్ కి చెందిన గ్లోబల్ సినిమాస్ సంస్థ విడుదల చేస్తోంది’’ అని అన్నారు.

టెన్త్ క్లాస్ డైరీస్ తారాగణం:

Telugu Srinivasa Reddy, Avika Gor, Sri Ram, June, Tenth Class-Movie

శ్రీరామ్, అవికా గోర్, శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన (వేద), హిమజ, శివబాలాజీ, మధుమిత, ‘సత్యం’ రాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయి రామ్, రాజశ్రీ నాయర్, సత్యకృష్ణ, రూప లక్ష్మి, ‘తాగుబోతు’ రమేష్, ‘చిత్రం’ శ్రీను, గీతా సింగ్, రోహిణి (జబర్దస్త్), ‘జెమినీ’ సురేష్, ‘ఓ మై గాడ్’ నిత్య, రాహుల్, ‘కంచెరపాలెం’ కేశవ, ప్రేమ్, భవ్య, కావేరి , అంబటి శ్రీను, జీవన్ (జబర్దస్త్), భాష, కేఏ పాల్రాము, గణపతి (జబర్దస్త్), రాకేష్ (జబర్దస్త్), కమల్, మహేష్ మచిడి.

సాంకేతిక నిపుణుల వివరాలు:

కథ : రామారావు, స్క్రీన్ ప్లే – డైలాగ్స్: శ్రుతిక్, లిరిక్స్: చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్, సురేష్గంగుల, కొరియోగ్రఫీ: శేఖర్ వీజే, విజయ్ బిన్నీ, సన్నీ, ఫైట్స్: స్టంట్స్ జాషువా, పబ్లిసిటీడిజైనర్: అనంత్, ప్రొడక్షన్ కంట్రోలర్: నరేన్ జి సూర్య, మేకప్: నారాయణ, కాస్ట్యూమ్స్: శ్రీదేవి కొల్లి, కో-డైరెక్టర్: విజయ్ కామిశెట్టి, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ, ఎడిటర్: ప్రవీణ్ పూడి, ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, మ్యూజిక్: సురేష్ బొబ్బిలి, కో-ప్రొడ్యూసర్: రవికొల్లిపర, సమర్పణ: అజయ్ మైసూర్, నిర్మాతలు: అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం, సినిమాటోగ్రఫీ & దర్శకత్వం : ‘గరుడవేగ’ అంజి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube