తెలంగాణలో మంత్రి కేటీఆర్‌కు యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది.ఇంకా చెప్పాలంటే కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో క్రేజ్ ఉన్న యువ నేతల్లో కేటీఆర్ ముందుంటారనే చెప్పాలి.
సాధారణంగా రాష్ట్రంలో గవర్నర్ తర్వాత ముఖ్యమంత్రికి సర్వాధికారాలు ఉంటాయి.సీఎం తర్వాత మంత్రులకు అధికారాలు ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే.
అయితే తెలంగాణలో మాత్రం భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.రాష్ట్రంలో ఎలాంటి ఘటన చోటు చేసుకున్నా, ఏదైనా సంచలనం జరిగినా కేటీఆర్ స్పందించాకే ఇతర నేతలు స్పందిస్తున్నారు.
తాజాగా జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో బాలికపై రేప్ కేసు ఉదంతం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.పబ్‌లో పరిచయమైన బాలికకు మాయ మాటలు చెప్పి బేకరీకి తీసుకెళ్లి తిరిగి తీసుకొచ్చే సమయంలో గ్యాంగ్ రేప్ జరిగింది.
ఈ ఉదంతంలో పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారని మీడియాలో వార్తలు రావడం సంచలనానికి దారి తీసింది.ముఖ్యంగా ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, హోంమంత్రి మనవడు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
దీంతో పోలీసులు ఆఘమేఘాల మీద స్పందించి ఈ కేసుతో హోంమంత్రి మనవడికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.ఈ ఘటనపై ఫిర్యాదు మే 31న పోలీసులకు అందగా మూడు రోజుల పాటు ప్రభుత్వ నేతల నుంచి స్పందన లేదు.
ఎప్పుడైతే ప్రజాప్రతినిధుల హస్తం ఉందని వార్తలు వచ్చాయో అప్పటి నుంచి కేసు కొత్త టర్నింగ్ తీసుకుంది.ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.ఈ కేసులో నిందితులు ఏ స్థాయిలో ఉన్నా.ఎంతటి వారైనా సరే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.కేటీఆర్ అలా ట్వీట్ చేశారో లేదో.కాసేపటికే హోంమంత్రి మహమూద్ అలీ కూడా స్పందించారు.
మైనర్ బాలికపై రేప్ కేసు విషయంలో నేరం చేసిన వారు ఎంతటి స్థానంలో ఉన్నా చట్ట ప్రకారం శిక్షిస్తామంటూ ట్వీట్ చేశారు.అయితే కేటీఆర్ ట్వీట్ చేయకముందే హోంమంత్రి స్పందిస్తే బాగుండేదని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
శాంతిభద్రతల విషయంలో స్పందించాల్సిన హోంమంత్రి బాధ్యతలను కేటీఆర్ గుర్తుచేసినట్లు అయ్యిందని పలువురు సెటైర్లు పేలుస్తున్నారు.కేటీఆర్ ట్వీట్ చేస్తేనే అధికారులు స్పందిస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు.








