సాధారణంగా మహిళలు ప్రసవ సమయంలో చాలా వేదన పడుతుంటారు.అందుకే బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు డాక్టర్లు, నర్సులు ఇలా చాలా మంది తల్లికి సహాయం చేస్తారు.
డెలివరీ అనేది ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తూనే మరోవైపు తీవ్ర నొప్పిని కలిగిస్తుంది.మగువల జీవితంలో డెలివరీ సమయంలో మళ్లీ చనిపోయి పుట్టినంత బాధ కలుగుతుందంటే అతిశయోక్తి కాదు.
అయితే తాజాగా ఒక తల్లి మాత్రం ఎవరి సహాయం లేకుండా, ఎక్కువగా బాధ లేకుండా మగబిడ్డకు జన్మనిచ్చింది.అది కూడా పసిఫిక్ మహాసముద్రంలో! వినడానికి చాలా వింతగా ఉన్నా ఇది అక్షర సత్యం.
దీనికి సంబంధించిన వీడియోని కూడా ఆ తల్లి @Raggapunzel అనే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నివేదికల ప్రకారం, పసిఫిక్ మహా సముద్రంలో జోసీ అనే ఒక మహిళ ఇటీవల ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది.ఈమె నలుగురు పిల్లలకు తల్లి కాగా తాజాగా తన 4వ బిడ్డకు వింతగా జన్మనిచ్చి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
దీనికి సంబంధించిన మూడు వీడియోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది.ఒక వీడియోలో, ఆమె తన భర్త బెన్నీ కార్నెలియస్‌తో కలిసి కనిపించింది.

వైరల్ అవుతున్న వీడియోలో డెలివరీ సమయంలో సముద్రపు అలలు తన వీపును తాకుతున్నప్పుడు జోసీ నొప్పితో మూలుగుతూ కనిపించింది.ప్రసవ సమయంలో తన వీపును తాకుతున్న అలలు తనకు హాయిగా అనిపించాయని ఆమె చెప్పుకొచ్చింది.ఆమె భర్త ప్రసవానికి సహకరించాడు.బొడ్డు తాడును సంరక్షించడానికి ఒక తువ్వాలు, గిన్నెలు వంటి సాధారణ వస్తువులను మాత్రమే ఉపయోగించారు.డెలివరీలో ఎటువంటి ఆధునిక పరికరాలు లేదా సాంకేతికతను ఉపయోగించలేదు.ఈ వీడియోని చూసి నెటిజన్లు అద్భుతం అని కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియోని మీరు కూడా వీక్షించండి.







